చంద్రబాబు అందుకే తిట్టారు-ఫోన్ లో క్లాస్ పై స్పందించిన మంత్రి సుభాష్ క్లారిటీ.. !
ఏపీలో తాజాగా సీఎం చంద్రబాబుకూ, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కూ మధ్య జరిగిన ఓ సంభాషణకు సంబంధించిన ఆడియో కాల్ వైరల్ అవుతోంది. ఇందులో టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యం మేరకు చేయించని సుభాష్ కు చంద్రబాబు క్లాస్ పీకుతున్నట్లు ఉంది. దీంతో ఈ ఆడియో కాల్ ను వైసీపీ వర్గాలు నిన్న బాగా వైరల్ చేశాయి. దీనిపై ఇవాళళ మంత్రి సుభాష్ స్పందించారు.
నిన్నంతా తన అధినాయకుడు చంద్రబాబు మందలించిన ఆడియో విపరీతంగా ట్రోల్ చేశారని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. అదే తాను ప్రైవేట్ గా ప్రమోట్ చేయించకుంటే ఎంతో ఖర్చు అయ్యేదని, కానీ వైసీపీ, సాక్షి ఆ పని ఫ్రీగా చేసి పెట్టాయన్నారు. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటింగ్ 26 శాతం నుంచి 41 శాతానికి పెరిగిందన్నారు.
వార్డు మెంబర్ కూడా కానీ తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చి శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని గర్వపడేలా చేసారన్నారు.

తన అలసత్వం వల్ల, తప్పు ఉండటం వల్ల సీఎం చంద్రబాబు తండ్రిలా ఒక్క మాట అంటే తాము స్పందించి తప్పు సరిచేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ వేరే కోణంలో చూడబోమన్నారు.ఓ టీచర్ విద్యార్దిని మందలించినా, కొట్టినా వారి శ్రేయస్సు కోసమేనన్నారు. ఇది కూడా అలాంటిదేనన్నారు. చంద్రబాబు పార్టీ విషయాల్లో ఎంత క్లియర్ గా ఉంటారో, వ్యక్తిగత అంశాల్లోనూ కింది స్ధాయి నాయకుల్ని చాలా కీన్ గా చూస్తారన్నారు. అతను కార్యకర్తల్ని పట్టించుకుంటున్నాడా లేదో చూస్తారన్నారు.
తన కోసం ఎన్నికల్లో కష్టపడిన వారిని చంద్రబాబు మర్చిపోరన్నారు. కానీ జగన్ మాత్రం తనకోసం కష్టపడిన చెల్లి, తల్లిని బయటికి గెంటేస్తారన్నారు. తప్పు చేసినప్పుడు దాన్ని గుర్తించి చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రత్యర్ధుల ఏడుపులే తనకు దీవెనలు అవుతున్నాయన్నారు. తమ ఓటింగ్ శాతం 26 నుంచి 41కి పెంచిన వారి మేలు మర్చిపోలేనన్నారు. అయితే తన ఐదేళ్ల క్రితం ఫొటో వాడుతున్నారని, కావాలంటే తాజా ఫొటో ఇస్తానన్నారు.












Click it and Unblock the Notifications