AP Budget : బడ్జెట్ పై మంత్రులు బొత్స, వేణు ఏమన్నారంటే ? ఉద్యోగులు, విపక్షాలపై వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన రాష్ట్రవార్షిక బడ్జెట్ పై ఆయన సహచర మంత్రులు స్పందిస్తున్నారు.
అమరావతి : ఏపీలో ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తమదైన శైలిలో స్పందించారు. బడ్జెట్ ద్వారా ఎవరికి మేలు జరిగింది, విపక్షాల బడ్జెట్ ప్రసంగం బహిష్కరణ, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరి వంటి పలు అంశాలపై వీరు మాట్లాడారు.
ఇవాళ అసెంబ్లీలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది అన్నారు. పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తమదని, వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని బొత్స తెలిపారు. విద్య ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశమన్నారు. విద్యా రంగానికి 32వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారన్నారు. ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామన్నారు. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామని బొత్స తెలిపారు.

గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు...ఆత్మహత్యలు చూశామని, తమ ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారని బొత్స వెల్లడించారు. ఉద్యోగులతో పని చేయించుకున్నప్పుడు జీతాలివ్వాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన తెలిపారు. ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను బడ్జెట్ లో కలిపి చూపారనడంలో లో వాస్తవం లేదని బొత్స తెలిపారు.
బడ్జెట్ పై సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా స్పందించారు. రాష్ట్ర సంక్షేమ బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని వేణు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్ ఇది అన్నారు. ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించిన తీరు చాలా బాధకరమన్నారు. ప్రతిపక్షానికి పసలేక, ప్రభుత్వాన్ని ప్రశ్నించే దైర్యం లేక అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారన్నారు. తమ నాయకుడి ఎజెండా ఒక్కటేనని...పెత్తందారి విధానం నుండి పేదవాడికి సంరక్షించడమే లక్ష్యమన్నారు. తమ నాయకుడు ఏ లక్ష్యం అయితే నమ్మి పరిపాలన సాగిస్తున్నారో...ఆ పరిపాలన తగ్గ బడ్జెట్ లను ప్రభుత్వం ప్రవేశ పెడుతూ వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులలో ఈర్ష్య , ద్వేషం కనపడుతుందన్నారు. తమ బీసీలకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వేణు వెల్లడించారు.












Click it and Unblock the Notifications