వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై ఏపి మంత్రుల ఫైర్: గవర్నర్‌కు వినతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు బుధవారం గవర్నర్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు.

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ విభజన చట్టానికి చిల్లులు పొడుస్తోందని ఆరోపించారు. ఎన్‌జి రంగా వర్సిటీ పేరును మార్పుచేయడం సరికాదని వారు గవర్నర్‌కు వివరించారు. విభజన చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని అనేక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ విశ్వవిద్యాలయాల ద్వారా వచ్చే ఫలితాలు, ప్రయోజనాలు రెండు రాష్ట్రాల్లోని రైతులు, విద్యార్ధులు, ప్రజలకు సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం వెలువరించిన నిర్దేశం, నిబంధనలు అన్ని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్ల నియామకం నుంచి విశ్వవిద్యాలయం పేర్ల మార్పు వరకు ఏమి చేయాలన్నా కేంధ్రంద్రం అనుమతి తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు.

ఇటువంటి అంశాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతింటాయని వారు అన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం విభజన చట్టం కింద ఉల్లంఘనేనని వారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదులపై గవర్నర్ స్పందిస్తూ ఏకపక్ష నిర్ణయాలు లేకుండా చూస్తానని హామీనిచ్చినట్లు తెలిసింది. అలాగే ఉత్తర్వుల జారీపై కూడా తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేస్తానని కూడా గవర్నర్ రాష్ట్ర మంత్రులకు చెప్పినట్లు తెలిసింది.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు బుధవారం గవర్నర్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ విభజన చట్టానికి చిల్లులు పొడుస్తోందని ఆరోపించారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

సమస్యలు ఉంటే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంస్థలు తమకే చెందుతాయన్న కోణంలో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

విభజన చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని అనేక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

ఏ రాష్ట్రానికి ఏయే సంస్థలు చెందుతాయో తొమ్మిదవ షెడ్యూల్‌లో, ఉమ్మడి సంస్థలు ఏవి ఉంటాయన్నది పదవ షెడ్యూల్‌లో స్పష్టంగా ఉందని, అయితే వాటిని తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఆరోపించారు.

ఏపి మంత్రులు

ఏపి మంత్రులు

ఈ రెండు షెడ్యూళ్లలో లేని సంస్థల విషయంపై రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

English summary
AP Deputy CM Krishna Murthy along with some ministers on Wednesday met Governor ESL Narsimhan at Rajbhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X