
దత్తపుత్రుడి త్రీ క్యాపిటల్స్ ఇవే- పవన్ పై రోజాతో సహా మంత్రుల ఫైర్..!!
ఏపీ మంత్రులు వరుసగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనపైన పవన్ స్పందించారు. ఎందుకీ గర్జనలు అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. అందులో వరుసగా ప్రశ్నలను సంధించారు. దీనికి స్పందనగా మంత్రి రోజా తిరుమలలో పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. స్టార్ గా ఎదిగి పవన్ ప్రజలకు ఏం చేసారని ప్రశ్నించారు. పవన్ విచిత్రంగా అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో దూరి ట్వీట్లు..ప్రెస్ మీట్లు నిర్వహించి ఆ తరువాత ఆరు నెలలు కనిపించరని ఎద్దేవా చేసారు.
ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి
— Ambati Rambabu (@AmbatiRambabu) October 10, 2022
గర్జన అర్ధమవుతుందా? @PawanKalyan
మాడు ప్రాంతాలను సమానంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులను ప్రతిపాదించారని రోజా చెప్పుకొచ్చారు. టీడీపీ నానా యాగీ చేస్తూ ఒక ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో తొడలు కొడుతూ .. మీసాలు తిప్పుతూ మరో ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాలను పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగులో టీడీపీ విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు. అమరావతి ఉద్యమం అత్యాశావాదుల ఉద్యమంగా రోజా అభివర్ణించారు. గతంలో రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ దూరం కావటంతో ఏపీ నష్టపోయిందని, తిరిగి ఆ పరిస్థితి రాకూడదనే డెవలప్ మెంట్ అంతా ఒకే చోట ఉండదకూడదనేది తమ ప్రభుత్వా విధానమని మంత్రి రోజా చెప్పుకొచ్చారు.

ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు జనసేనాని ట్వీట్ పైన స్పందించారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్ళకి ..గర్జన అర్ధమవుతుందా అంటూ రాంబాబు ట్వీట్ చేసారు. మరో మంత్రి గుడివాడ అమర్నాధ్ తాజాగా ట్వీట్లు చేసారు. అందులో దత్త తండ్రి తరపున దత్త పుత్రుడి మియావ్ మియావ్ అంటూ పోస్టు చేసారు. దీనికి కొనసాగింపుగా.. దత్తపుత్రుడి త్రీ క్యాపిటల్స్ అంటూ.. అంతర్జాతీయ రాజధాని మాస్కో, జాతీయ రాజధాని ముంబాయి, పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ ట్వీట్ చేసారు. మూడు రాజధానుల వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పి కొట్టాలని అధికార వైసీపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా టీడీపీ - జనసేనను టార్గెట్ చేస్తోంది.
దత్త తండ్రి @ncbn తరఫున.. దత్త పుత్రుడి @PawanKalyan మియావ్ మియావ్...!
— Gudivada Amarnath (@gudivadaamar) October 10, 2022