ఢిల్లీ సంకేతాలు, ఏపీ అసెంబ్లీ భేటీకి పిలుపు - కీలక ప్రకటన..!?
ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో, ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు చేసారు. కేంద్రం జమిలి ఎన్నికలకు ఆమోదం చెబితే సగానికి పైగా రాష్ట్రాలు అమోద ముద్ర వేయాల్సి ఉంది. అదే సమయంలో ముందస్తు ఎన్నికల పైనా నిర్ణయం ఉంటుందని భావిస్తున్న వేళ..ఏపీ అసెంబ్లీ భేటీ ఆసక్తిని పెంచుతోంది.
ఎన్నికల వేళ కీలక భేటీ:పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యంగ సవరణలు చేస్తారని సమాచారం. అదే సమయంలో ముందస్తు ఎన్నికలపైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జమిలి తొలి విడతలో భాగంగా లోక్ సభ ఎన్నికలతో పాటుగా 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఐక్య కూటిమి బలపడకుంగా కేంద్రం రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా..వాయిదా పడతాయా అనే చర్చ సాగుతోంది.

అటు లోక్ సభ.. ఇటు అసెంబ్లీ:ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభతో పాటుగానే జరగున్నాయి. షెడ్యూల్ ప్రకారమా..ముందస్తుగానే అనేది పార్లమెంట్ సమావేశాల సమయంలో స్పష్టత రానుంది. దీంతో, పార్లమెంట్ సమావేశాలు ముగుస్తూనే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం జమిలి, మహిళా బిల్లు పైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
ఈ రెండు బిల్లుల విషయంలో పార్లమెంట్ లో వైసీపీ మద్దతు కీలకం కానుంది. ఏపీలో పొత్తుల చర్చల వేళ..పార్లమెంట్ లో కేంద్రానికి వైసీపీ మద్దతు మరింత ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నుంచి మద్దతు అవసరమైన సమయంలో బీజేపీ నాయకత్వం, ఇటు రాష్ట్రంలో వైసీపీ ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలుపుతుందా అనే చర్చ సాగుతోంది.

కొత్త నిర్ణయాలకు సిద్దం:అదే విధంగా జమిలి పైన కేంద్రం ఆమోదం తెలిపితే, 50 శాతం రాష్ట్రాలు సైతం ఆమోదించాల్సి ఉంటుంది. బీజేపీ 12 రాష్ట్రాల్లో అధికారం ఉంది. మరో 3 రాష్ట్రాల మద్దతు అవసరం. ఆ సమయంలోనూ ఏపీ కీలకంగా మారనుంది. దీంతో, కేంద్రం తీసుకొనే నిర్ణయాలపైన ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే సమయంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..నాలుగున్నారేళ్ల కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం గురించి చెప్పటంతో పాటుగా.. ప్రభుత్వంపైన విమర్శలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇదే వేదిక నుంచి ఎన్నికల వేళ మరిన్ని కీలక నిర్ణయాలకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications