వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌గోపాల్ వర్మ భలే ఐడియా: అలా చేస్తే-గదులు, గ్యారేజీలు, గోడౌన్లు ఇక సినిమా థియేటర్లే

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి తెర పడట్లేదు. పైగా మరింత రాజుకుంటోంది. సంక్రాంతి పండుగ సీజన్ సమీపించన వేళ.. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదానికి శుభం కార్డు పడేలా కనిపించట్లేదు. అటు ప్రభుత్వం, ఇటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తమ బెట్టు వీడట్లేదు..మెట్టు దిగట్లేదు. ఈ పరిస్థితుల్లో టికెట్ల నిర్ధారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకొద్ది సేపట్లో భేటీ కానుంది.

తెగని వివాదం..

తెగని వివాదం..

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని-దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య ఏర్పాటైన సమావేశంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. టికెట్లను తగ్గించుకోవాల్సిందేననే తన వాదనకు జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను జగన్ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల దాని ప్రభావం కలెక్షన్లపై చూపుతుందనే ఆందోళన సినీ పరిశ్రమ పెద్దల్లో నెలకొంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనాన్ని కల్పించడం, లోటుపాట్లను సవరించడం వంటి అంశాలను పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

నాలుగు ఆప్షన్లు ప్రతిపాదించిన ఆర్జీవీ..

నాలుగు ఆప్షన్లు ప్రతిపాదించిన ఆర్జీవీ..

సినిమా టికెట్లపై ప్రభుత్వ నియంత్రణ, థియేటర్ల నిర్వహణ వంటి సమస్యలను పరిష్కరించడానికి రామ్ గోపాల్ వర్మ.. తనదైన శైలిలో నాలుగు ఆప్షన్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని పరిశీలించాల్సిందిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగింట్లో ఏ ఒక్కదాని పట్లయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తదనాన్ని పరిచయం చేసినట్టవుతుంది.

కారవాన్ థియేటర్లు..

కారవాన్ థియేటర్లు..

రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదించిన ఈ నాలుగు ఆప్షన్లు కూడా థియేటర్లకు సంబంధించినవే. పిక్చర్ టైమ్ పేరుతో ఓ ట్రక్‌ను ఏర్పాటు చేసి, అందులో సినిమాలను ప్రదర్శించడం. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఏ ప్రాంతానికైన సులువుగా వెళ్లగలిగే ట్రక్‌లల్లో, అన్ని భద్రత ప్రమాణాలను పాటించేలా సినిమాలను ప్రదర్శించడాన్ని థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

కారవాన్ టాకీస్..

కారవాన్ టాకీస్..

రెండో ఆప్షన్- కారవాన్ టాకీస్‌లను అందుబాటులోకి తీసుకుని రావడం. మూవ్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో కారవాన్ టాకీస్‌ల ద్వారా మారుమూల గ్రామాల్లోనూ సినిమాలను ప్రదర్శించ వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చలన చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసినట్టవుతుందనేది ఆయన ఉద్దేశం. మూడోది- నోవా సినిమాస్. ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విధానంలో సినిమా థియేటర్లను నిర్మించడం. సినిమాల ప్రదర్శన లేకప్పుడు వాటిని అద్దెకు ఇచ్చుకోవచ్చని, పలితంగా ప్రత్యామ్నాయ ఆదాయంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గదులు, గ్యారేజీలను సినిమా థియేటర్లుగా..

గదులు, గ్యారేజీలను సినిమా థియేటర్లుగా..

నాలుగో ఆప్షన్.. కొత్త థియేటర్లను నిర్మించడానికి ప్రజలను ప్రోత్సహించడం. ఖాళీగా పెద్ద గదులు, గ్యారేజీలు, గోడౌన్లను సినిమా థియేటర్లుగా బదలాయించాలని రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదించారు. వాటన్నింటినీ మినీ థియేటర్లుగా బదలాయించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం అందే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్లను అందుబాటులోకి తీసుకుని రావొచ్చని పేర్కొన్నారు.

English summary
AP Movie Tickets row: Ram Gopal Varma put four options in front of the minister Perni Nani
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X