అదే అవమానం, ఇక చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో పాచిపనులే: లక్ష్మీపార్వతి, అంబటి తీవ్ర విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో భారీ విజయాలను నమోదు చేసింది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబుకు మామకు చేసిన అవమానమే.. : లక్ష్మీపార్వతి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంప పెట్టు అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన కొడుకును వారసుడిగా చేయాలన్న ఆశయం పోయిందని, లాక్కున్న పార్టీని అడ్డంపెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడని అన్నారు.
ఇప్పుడు టీడీపీని భూస్థాపితం చేశాడని, ఇక తండ్రీకొడుకులు పాలు, కూరగాయలు అమ్ముకోవాల్సిందేనంటూ ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టారు లక్ష్మీపార్వతి. తన భర్త ఎన్టీఆర్‌కు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చిందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడని తెలిపారు.

చంద్రబాబు చేసిన పాపాలు లోకేష్ రూపంలో శాపంగా..
నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే ఇకనైనా చంద్రబాబును వదిలేయండని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటని ఆమె మండిపడ్డారు. ఇక చంద్రబాబు పని అయిపోయిందని, ఆత్మవిమర్శ చేసుకోవడానికి అతని మైండ్ కూడా చెడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలు అతని కొడుకు రూపంలో శాపంగా మారాయని అన్నారు.

చంద్రబాబు పనితీరు అత్యంత పేలవం..
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు ఊరూరా తిరిగి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ప్రజలు మాత్రం సీఎం జగన్ వైపే ఉన్నామని మరోసారి నిరూపించారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు భారీ విజయాలను అందించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కనీసం ఓటు వేయాలని కోరకున్నా.. ప్రజలు మాత్రం అభివృద్ధి సంక్షేమ పాలనకు మరోసారి మద్దతు పలికారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గతంలో ఏ అధికార పార్టీకి లభించని అనూహ్య విజయం వైసీపికి దక్కిందన్నారు. అదే సమయంలో ఇంతటి పేలవమైన పనితీరు గతంలో ఏ ప్రతిపక్షం ప్రదర్శించలేదని చంద్రబాబుకు చురకలంటించారు.

చంద్రబాబు, లోకేష్‌లు ఇక హైదరాబాద్ లో పాచిపనులకే.
ఫలితాలు వస్తుంటే చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రజలు తమకు ఓటేయకుంటే పాచిపనులు చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లాలని చంద్రబాబు అన్నారని.. ఇప్పుడు ఎవరింట్లో పాచి పనులు చేయడానికి చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వెళ్లారని అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భవిష్యత్తులో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. ఈ ఓటమి టీడీపీ పతనానికి నాంది అన్నారు. చంద్రబాబుకే పౌరషం లేదని, ఆయనకు పౌరషం ఉంటే టీడీపీకి రాజీనామా చేయాలన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి పౌరుషం ఉంటే.. చంద్రబాబు పార్టీలో ఉండే వారేకాదని అంబటి వ్యాఖ్యానించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications