వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ మొద‌లెట్టేసారు: ఆ ఇంజ‌నీరింగ్ ప‌నుల‌ను అపేయండి..సీఎంఓ అధికారుల పై వేటు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ని చేసిన ప‌లువురు అధికారుల పైన జ‌గ‌న్ వేటు వేసారు. అదే విధంగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంజ‌నీరింగ్ ప‌నులు ద‌క్కించుకొని ప‌న‌నులు ప్రారంభించని వారి కాంట్రాక్టులు ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు.ఇక‌, నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ధ‌నుంజయ రెడ్డి నియమితుల‌య్యారు.

సీఎంఓ అధికారుల పైన వేటు
ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కీల‌క ఉత్త ర్వులు జారీ చేసారు. చంద్ర‌బాబు వ‌ద్ద ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులుగా ప‌ని చేసిన న‌లుగురు అధికారుల ను బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. స‌తీష్ చంద్ర‌, సాయి ప్ర‌సాద్‌, గిరిజా శంక‌ర్‌, రాజ‌మౌళిని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అదే విధంగా కొద్ది రోజులుగా జ‌గ‌న్‌తోనే ఉంటూ..ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ధ‌నుంజ‌య రెడ్డిని నూత‌న ముఖ్య‌మంత్రి అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోని ఇత‌ర అధికారుల నియామ‌కానికి రంగం సిద్ద‌మైంది. రేపు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ కానున్నాయి.

AP new CM Jagan started his style of work with key decisions with transfers and financial regulations

ఇంజ‌నీరింగ్ ప‌నులు అపేయండి..
రాష్ట్రంలో ఆర్థిక వనరులు దిగజారుతున్నాయని, చెల్లింపులకు ఆర్థిక వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సదరు ఇంజినీరింగ్ పనులను నిలిపేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై, ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దుచేయాల్సిందేనని అన్ని శాఖలకు ఈ సందర్భంగా సూచనలు చేశారు. కనీసంలో కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో వాటి విలువలను తాజాగా నిర్ధరించి, తదుపరి చెల్లింపులు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రాధాన్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టు పనుల్ని కూడా సమీక్షించాల్సి ఉందని తెలిపారు. పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందించడమే కొత్త ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సీఎస్ తన మెమోలో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు.

English summary
AP new Cm Jagan started his functioning with key decisions. He transferred CMO officers who worked in Chandra babu peshi . Dhanunjaya Reddy Appointed as Addl secretary for Jagan. Rest of the CMO officers may appoint by to day night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X