వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ ఠాకూర్:టిటిడి పూర్తి భద్రతకు హామీ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. మంగళవారం తిరుమల శ్రీవారిని డీజీపీ ఠాకూర్ తన కుటుంబంతో కలసి దర్శించుకున్నారు.

టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.కుటుంబ సభ్యులతో స్వామి వారి దర్శనం అనంతరం ఠాకూర్ దంపతులకు టీటీడీ ఈవో కె.శ్రీనివాసరాజు, అర్చకులు రంగనాయకమండపంలో స్వామివారి ఫోటో,ప్రసాదాలు అందచేశారు.
ఈ సందర్భంగా డిజిపి ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు.

AP New DGP RP Thakur visits Tirumala Lord Venkateswara

అలాగే

బ్రహ్మోత్సవాలకు భద్రతపై టీటీడీ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. తిరుమలలో ట్రాఫిక్‌ సిబ్బంది, హోంగార్డులను నియమిస్తామని తెలిపారు. టిటిడి సీవీఎస్‌వో పోస్టును నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని, టెక్నాలజీ ఉపయోగించుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. డిజిపి ఠాకూర్ గత రాత్రి తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు మానస సరోవరంలో తెలుగువాళ్లు చిక్కుకున్న ప్రమాదంపై స్పందించింన ఎపి డిజిపి ఠాకూర్ ఉత్తరాఖండ్‌ డీజీపీ అనిల్‌ రాతూరికి ఈ విషయమై ఫోన్ చేశారు. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లి మంచు తుఫాన్‌లో చిక్కుకున్న యాత్రికులను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లా యాత్రికులున్నారని డీజీపీ సమాచారం అందించారు. ఉత్తరాఖండ్‌ పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాలు జారీ చేశారు.

English summary
AP New DGP RP Thakur visited Tirumala Lord Venkateswara with his family for the first time after taking charges as AP DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X