చంద్రబాబు చేయలేనిది - సీఎం జగన్ చేసారు : పక్కా వ్యూహం: ఎమోషనల్ ఎటాచ్ మెంట్స్..!!
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్లు జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలోనే దీనికి సంబంధించి జగన్ హామీ ఇచ్చారు. ఇది 2024 ఎన్నికల పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి.
అయితే, ప్రతీ పార్లమెంట్ నియెజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తూ.. పేర్లు ఖరారు మొదలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు వరకూ సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రజల మనోభావాలకు విలువ పెంచుతూ ఓన్ చేసుకొనే ప్రయత్నం చేసారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. కానీ, అప్పుడు ఈ నిర్ణయం అమలు కాలేదు. ఇప్పుడు జగన్ తన హామీ మేరకు దీనిని పూర్తి చేసారు.

బాధ - సంతోషం కలగలిసిన నిర్ణయాలు..
అయితే, ఎప్పటి నుంచో కలిసి ఉన్న జిల్లాలు ఇప్పుడు పార్లమెంటరీ వారీగా విడిపోతున్నాయి. భౌగోళికంగా మార్పులు జరుగుతున్నాయి. కానీ, అధికారిక ప్రక్రియలో విభజన జరుగుతోంది. ఇప్పుడు ఒక రకమైన బాధ...ఆవేదన.... సంతోషం కలగలిపిన అభిప్రాయలు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పైన వ్యక్తం అవుతున్నాయి.
మూడు రాజధానుల ద్వారా అధికార వికేంద్రీకరణ చేపడతామని చెప్పిన ప్రభుత్వం..న్యాయ పరమైన చిక్కులతో ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియ వేగంగా పూర్తి చేసింది. రేపు (4వ తేదీ) సీఎం జగన్ అధికారికంగా కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది.

చంద్రబాబు ఇలాకా - జగన్ నిర్ణయం
10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన కుప్పంను పట్టించుకోలేదు.
ఇప్పుడు వైఎస్ జగన్ జిల్లాల విభజన చేస్తున్న సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలాన్ని అక్కడి ప్రజల అభీష్టం మేరకు ఏలూరు జిల్లాలోకి మార్చారు. అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిన పెందుర్తిని స్థానికుల కోరిక మేరకు విశాఖ జిల్లాకు మార్చారు.

స్థానికంగా ఆకట్టుకొనే వ్యూహాలతో
అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా మార్చింది.
పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు అయింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్పులు చేసారు.

ఎన్టీఆర్ పేరు ఖరారుతో.. ఆ ప్రాంతంలో
తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మాట నెరవేర్చుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్ సుదీర్ఘ కాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసి ముందడుగు వేసింది.

ప్రజలకు మరింత దగ్గరయ్యే నిర్ణయాలుగా..
ఇప్పుడు జగన్ సీఎం గా తీసుకున్న ఈ నిర్ణయాలు ఏపీ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలుస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో రాజకీయంగానే.. రానున్న రోజుల్లో ఆర్దికంగానూ ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలన దగ్గర కావటంతో పాటుగా.. స్థిరాస్తుల విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక, పాలనా పరంగా అధికారిక నిర్ణయాలకు వేగవంతం చేసిన సీఎం జగన్...ఇక, రాజకీయంగానూ ఈ జిల్లాల్లో పట్టు మరింత సాధించే క్రమంలో అడుగులు వేయనున్నారు. ఈ నెల 7వ తేదీన కేబినెట్ సమావేశం ద్వారా రాజకీయ నిర్ణయాలు ప్రారంభం కానున్నాయి.
-
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!











Click it and Unblock the Notifications