గేరు మార్చిన ఏపీ ప్రభుత్వం - పోలవరం అధికారుల నిలదీత : ఎంతిస్తారు..పనులు ఎలా..!!
ఇప్పటి వరకు కేంద్రంతో సానుకూలంగా అన్ని విషయాల్లో అభ్యర్ధిస్తూ వచ్చిన ఏపీ అధికారులు ఒక్క సారిగా గేరు మార్చారు. ప్రభుత్వానికి..రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు అంశంలో ఇక గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇప్పటికే పోలవరం సవరించిన అంచనాల ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, 2014 అంచనాల ప్రకారమే తాము నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఈ సమయంలోనే పీపీఏ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పీపీఏ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు
ఈ సారి సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపకుండా మీ దగ్గరే ఉంచుకుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులను నిలదీశారు. దీనిని వారు సైతం ధీటుగానే సమాధానం ఇచ్చారు. అడిగిన సమాచారం ఇస్తేనే కదా మేం పంపేది అని అథారిటీ అధికారులు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ఈ వాదోపవాదాలతో హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం వాడీ వేడిగా సాగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతి అంశంపై ఆంధ్రప్రదేశ్, పీపీఏ అధికారుల మధ్య పరస్పరం వాదనలు సాగాయి.

ప్రతిపాదనలే పంపకుంటే ఆమోదం ఎప్పుడు
వాస్తవానికి ఈ అంశం ఎజెండాలో లేకున్నా ఏపీ అధికారులు నిలదీయడంతో అథారిటీ అధికారులు సమాధానమిచ్చారు. వాదోపవాదాల అనంతరం.. నెల రోజుల సమయం తీసుకొని సమాచారం పంపాలని అథారిటీ అధికారులు సూచించారు. పది రోజుల్లోనే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానమిచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి అనుమతిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సవరించిన అంచనాను ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా, అథారిటీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ కారణంగా ఇప్పటి వరకు ఫైలు కేంద్రానికి వెళ్లలేదు.

ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
పెట్టుబడి అనుమతి కేంద్ర జల్‌శక్తి శాఖకు సంబంధించిన అంశమని పీపీఏ అధికారులు పేర్కొంటున్నారు. ముందు పీపీఏ నుంచి వెళ్లాల్సిన అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలకు సమాధానం ఇస్తే పరిశీలించి దిల్లీకి పంపుతామని అథారిటీ అధికారులు సమాధానం ఇచ్చారు. పది రోజుల్లో పంపుతామని, ప్రాజెక్టుకు కేంద్రం ఎంత ఇస్తుందో తెలియకుండా పనులు ఏం చేస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానమిచ్చారు. తాగునీటి వ్యయాన్ని అంచనాలో చేర్చే అంశంపై చర్చ జరిగింది.
Recommended Video

కేంద్రానికి పంపేందుకు నిర్ణయం
దీన్ని తాము కేంద్రానికి పంపుతామని, అక్కడ అధికారులతో మాట్లాడాలని అథారిటీ అధికారులు సూచించినట్లు తెలిసింది. దీనికి కొనసాగింపుగా బిల్లుల చెల్లింపులో కాంపొనెంట్ల వారీగా ఉన్న పరిమితుల గురించి ఏపీ అధికారులు ప్రశ్నించగా..ఈ అంశం తమ చేతుల్లో లేదని పీపీఏ అధికారులు తేల్చి చెప్పేసారు. అదే విధంగా పునరావాసం విషయంలో పురోగతి లేకపోవడం, పనుల్లో జాప్యం గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి మార్చడంపై చర్చించారు. కానీ, తుద నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications