సీఎం జగన్ కీలక నిర్ణయం : పోలెండ్ - హంగేరీకి ఏపీ ప్రతినిధులు: విద్యార్ధుల తరలింపు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధుల తరలింపు కోసం ప్రత్యేక ప్రతినిధులను పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే రష్యా - ఉక్రెయిన్ యుద్దం కారణంగా అనేక మంది విద్యార్ధులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. వారిని రప్పించాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాసాయి. విదేశాంత శాఖా మంత్రి జై శంకర్ తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ గగతన తలంలో విమానాల రాకపోకలు నిషేధించటంతో సరిహద్దు దేశాల నుంచి కేంద్రం వాయుసేన విమానాల ద్వారా భారతీయులను తరలిస్తోంది.

సైనికి విమానాల్లో తరలింపు

సైనికి విమానాల్లో తరలింపు

ఇప్పటికే విమానాల ద్వారా భారతీయులు ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్నారు. అయితే, ఉక్రెయిన్ లో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. దీంతో..భారత రాయబార కార్యాలయం సైతం కీలక సూచనలు చేస్తోంది. ఇప్పటికే రష్యా దాడుల్లో భారతీయ విద్యార్ది.. కర్ణాటకకు చెందిన నవీన్ మరణించారు. ఇక, ఏపీకి చెందిన వారు సైతం పలువురు ఉక్రెయిన్ లో ఉండటంతో వారిని అధికారులకు మ్యాపింగ్ చేస్తున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వారితో టచ్ లో ఉంది. అయితే, కీవ్ నగరం నుంచి బయటకు వచ్చిన విద్యార్ధులు రైళ్ల ద్వారా సరిహద్దులకు చేరుతున్నారు.

ఏపీ ప్రతినిధులు ఆ దేశాలకు

ఏపీ ప్రతినిధులు ఆ దేశాలకు

రొమేనియా, హంగేరీ, పోలాండ్ నుంచి వారిని తరలిస్తున్నారు. రానున్న రోజుల్లో మొత్తం 31 విమానాల ద్వారా.. 6,300 మందికిపైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ సైతం ఇప్పటికే కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లాలని ఆదేశించారు. మంత్రులు అక్కడ నుంచే స్వయంగా భారతీయుల తరింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను హంగేరీ..పోలాండ్ కు పంపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ తెలుగు విద్యార్ధులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Recommended Video

    #RussiaUkraineConflict: దిక్కుతోచని స్థితిలో Indian Students సవాల్ గా Operation Ganga | Oneindia
    నేరుగా ఏపీకి రప్పించేలా

    నేరుగా ఏపీకి రప్పించేలా


    ఢిల్లీలోని ఏపీ భవన్ తో పాటుగా ... ఏపీలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. ఇప్పటికే కొందరు విద్యార్ధులు ఏపీకి చేరుకున్నారు. విద్యార్ధుల ఇబ్బందులు.. వారి తల్లితండ్రుల ఆందోళనతో త్వరిత గతిన వారిని రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం తమ ప్రతినిధులను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీకి మంగళవారం 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఏపీ వారు కాగా, 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీ విద్యార్ధుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+