జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారు..: ప‌్ర‌తిప‌క్ష నేత‌గా నా అభ్య‌ర్ద‌న ఇదే..: సీఎంకు చంద్ర‌బాబు లేఖ‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు మాజీ ముఖ్య‌మంత్రి..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తొలి లేఖ రాసారు. డియ‌ర్ శ్రీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారు అంటే సంభోదిస్తూ ప్రారంభించిన లేఖ‌లో త‌న‌కు ప్ర‌స్తుతం ఉంటున్న నివాసాన్ని ప్ర‌తిప‌క్ష నేత నివాసంగా గుర్తిస్తూ..ప‌క్క‌నే ఉన్న ప్ర‌జా వేదిక‌ను అనుబందంగా కొన‌సాగించాల‌ని కోరారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఏ ర‌కంగా స్పందిస్తార‌నేది ఆసక్తి క‌రంగా మారింది.

ప్ర‌జా వేదిక‌ను కేటాయించండి...
మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసారు. కృష్ణా క‌ర‌క‌ట్ట మీద చంద్ర‌బాబు నివాసం ఉంటున్న త‌న నివాసం ప‌క్క‌నే తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌జా వేదిక పేరుతో కొత్త క‌ట్ట‌డం పూర్తి చేసారు. పార్టీ.. ప్ర‌భుత్వ స‌మీక్ష‌లు అక్కడే కొన‌సాగించేవారు. అయితే, ఇప్పుడు టీడీపీకి అమ‌రావ‌తిలో కార్యాల‌యం సైతం లేక‌పోవ‌టంతో తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని చంద్ర‌బాబు లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేసారు.

AP Opposition leader Chandra Babu letter to CM Jagan to declaration of Praja vedika as his official residence

పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ స‌మ‌యంలో ప్ర‌జా వేదిక కొన‌సాగిస్తూ బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం కావ‌టంతో చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత హోదాలోనే ముఖ్య‌మంత్రికి ఈ లేఖ రాసారు.

ముఖ్య‌మంత్రి అంగీక‌రించేనా..
ప్ర‌తిప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు రాసిన తొలి లేఖ‌పైన జ‌గ‌న్ ఏర‌కంగా స్పందిస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యం నుండి ముఖ్య‌మంత్రి నివాసం ఉంటున్న ఇల్లు ఆక్ర‌మించి క‌ట్టిన‌ద‌ని..నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్మించింద‌ని చెబుతూ వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు ఈ ఇంటికి అనుబంధంగా నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కొన‌సాగించ‌మ‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు.

ఒక వైపు రాజ‌ధానిలో అక్ర‌మాల పైన విచార‌ణ అవ‌స‌ర‌మ‌ని ఒక వైపు చెబుతున్న జ‌గ‌న్ ఇప్పుడు చంద్ర‌బాబుకు ప్ర‌జా వేదిక కొన‌సాగించ‌టా నికి వీలుగా నిర్ణ‌యం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే. చంద్ర‌బాబు లేఖ‌ను జీఏడి..సీఆర్‌డిఏ అధికారుల‌కు పంపి..నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉంటే కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+