AP Panchayat Election: ముగిసిన మూడవ విడత పోలింగ్.. కౌంటింగ్ ప్రారంభం

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభం అయ్యాయి. సరిగ్గా తెల్లవారు జామున 6:30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఈ విడతలో మొత్తం 3,221 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. అందులో 579 చోట్ల ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. మిగిలిన 2,640 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది.

అలాగే- 33,570 వార్డులకు 12,604 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 19,533 వార్డులకు ఎన్నికలు చేపట్టారు.ఇక పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఉపసర్పంచి ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారులు వివరించారు.

AP Panchayat Elections 2021 Live Updates In Telugu:Polling for Panchayat elections begins

మొత్తం 26,851 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. 47,492 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 4,118 పంచాయతీలను సమస్యాత్మకమైనవిగా 3,127 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 7,757 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం, 43,162 మంది వార్డు సభ్యుల కోసం పోటీ పడుతోన్నారు. పోలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం అప్‌డేట్..

Feb 17, 2021, 3:43 pm IST

జమిగూడ, బొంగరం, లింగేటి లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపుె ప్రారంభం
Feb 17, 2021, 3:42 pm IST

ముగిసిన మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్‌ నమోదు
Feb 17, 2021, 10:36 am IST

అనంతపురం జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం పోలింగ్‌నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.
Feb 17, 2021, 10:19 am IST

పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో భాగంగా వెన్నలపాలంలో అరకు వైసీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Feb 17, 2021, 9:48 am IST

గుంటూరు జిల్లా మాడుగులలో ఓ పోలింగ్ కేంద్రలోని బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు.12 మరియు 13 వార్డుల్లో పోలింగ్ నిలిపివేత
Feb 17, 2021, 9:46 am IST

ఉరవకొండ 3వ వార్డులో పోలింగ్ వాయిదా. నామినేషన్ ఉపసంహరించుకున్న వ్యక్తి పేరు బ్యాలెట్ పేపర్ పై ఉండటంతో నిర్ణయం
Feb 17, 2021, 9:45 am IST

ఉదయం 8:30 గంటల వరకు 11.90శాతం పోలింగ్
Feb 17, 2021, 9:23 am IST

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర వ్యాప్తంగా మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు వెల్లడించిన ఎన్నికల అధికారులు
Feb 17, 2021, 9:01 am IST

కర్నూలు

నందికొట్కూరు మండలంలోని బ్రహ్మణకొట్కూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కర్నూలు ఆర్డీఓ, డిప్యూటీ జిల్లా ఎన్నికల అథారిటీ వెంకటేశులు.
Feb 17, 2021, 8:55 am IST

విజయనగరం

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా విజయనగరం జిల్లాలో 8.30 గంటల వరకు 14 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు అంచనా. కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్న జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్
Feb 17, 2021, 8:47 am IST

కర్నూలు

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పత్తికొండ మండలంలోని నాలకదొడ్డిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన ఓటర్లు. పోలింగ్ ఏర్పాట్లను తనిఖీ చేసిన ఆదోని ఆర్డీవో, డిప్యూటీ జిల్లా ఎన్నికల అథారిటీ రామకృష్ణారెడ్డి.
Feb 17, 2021, 8:42 am IST

కర్నూలు

దివ్యాంగుల కోసం జిల్లా అధికారులు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌ఛైర్‌లను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలింగ్ కేంద్రం వద్ద జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వీల్‌చైర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళుతున్న ఓ వృద్ధురాలు.
Feb 17, 2021, 8:18 am IST

కర్నూలు

మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించడానికి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారు జామున 5:30 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తోన్న కలెక్టర్ జీ వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి
Feb 17, 2021, 7:50 am IST

ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక, సున్నిత పంచాయతీల్లో డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తోన్న అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పరిశీలన
Feb 17, 2021, 7:31 am IST

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరుతున్నారు.
Feb 17, 2021, 7:19 am IST

ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ పోలింగ్‌ సందర్భంగా మొత్తం 55.75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం 13 జిల్లాల్లో 20 డివిజన్లు, 160 పంచాయతీల్లో 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Feb 17, 2021, 7:05 am IST

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా సజావుగా కొనసాగుతోన్న పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరింపు. డ్రోన్ల ద్వారా భద్రత పర్యవేక్షణ. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులను సమస్యాత్మక, సున్నిత పంచాయతీల్లో మోహరింపజేసిన ఎన్నికల కమిషన్.
Feb 17, 2021, 6:36 am IST

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కొద్దిసేపటి కిందటే ఆరంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. చివరిగంటలో కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.
Feb 13, 2021, 3:41 pm IST

ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..చివరి నిమిషంలో క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన ఎన్నికలు అధికారులు
Feb 13, 2021, 2:18 pm IST

పామర్రు పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఎమ్మెల్యే కైలా అనిల్‌ కుమార్‌కు చేదు అనుభవం. పోలీసులు దూషించారని ఆరోపణ
Feb 13, 2021, 2:18 pm IST

గుంటూరు జిల్లా నకిరేకల్లు పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఘర్షణ. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం
Feb 13, 2021, 2:16 pm IST

ఓటు వేసిన కొద్ది నిమిషాలకే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి లీలా కనకదుర్గ
Feb 13, 2021, 1:14 pm IST

మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి 64.28శాతం పోలింగ్ నమోదు
Feb 13, 2021, 1:10 pm IST

మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఆలోగ క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్న అధికారులు
Feb 13, 2021, 12:39 pm IST

కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు. కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆదేశం
Feb 13, 2021, 11:08 am IST

విజయనగరం

పార్వతీపురం కిష్టపల్లి వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.
Feb 13, 2021, 11:07 am IST

గుంటూరు

నరసరావుపేట డివిజన్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ. పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం
Feb 13, 2021, 10:56 am IST

అనంతపురం

ఉదయం 10:30 గంటల సమయానికి 9శాతం మాత్రమే పోలింగ్ నమోదు
Feb 13, 2021, 10:25 am IST

కర్నూలు

కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం కవులూరు పోలింగ్ కేంద్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చి నడవలేని స్థితిలో ఉన్న వృద్దుడిని పోలింగ్ కేంద్రం వద్దకు చేతుల మీద తీసుకెళ్తున్న పోలీసులు.
Feb 13, 2021, 10:09 am IST

కడప

రెండో విడత పంచాయతీ ఎన్నికల సందరభంగా కమలాపురం మండలం నల్లింగాయపల్లిలో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలికి సహకరిస్తోన్న చాపాడు ఎస్ఐ హరిప్రసాద్.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+