• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

|

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. నాలుగు విడతల ఎన్నికలకుగానూ ఆదివారంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఎస్‌ఈసీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డకు, జగన్ సర్కారుకు మధ్య లేఖల వార్ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో విశాఖ మన్యం నుంచి వెలువడిన మావోయిస్టుల లేఖ సంచలనంగా మారింది..

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులు

బహిష్కరణకు పిలుపు..

బహిష్కరణకు పిలుపు..

ఏపీలో పంచాయితీ ఎన్నికలను ప్రజలంతా బహిష్కరించాలని నిషేధిత మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. బూటకపు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఒరిగేది ఏమీ లేదని, దోపిడీ పార్టీలైన వైసీపీ, టీడీపీ, బీజేపీలకు జనమే బుద్ది చెప్పాలంటూ ఆ పార్టీ రాసిన ఓ లేఖ ఆదివారం వెలుగులోకి వచ్చింది. విశాఖ మన్యం కేంద్రంగా కలాపాలు నిర్వహించే మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది. ఇందులో..

కోర్టు, రాజ్యాంగ ధిక్కరణ..

కోర్టు, రాజ్యాంగ ధిక్కరణ..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ సర్కారు.. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్, కింది కోర్టుల తీర్పులతో పదే పదే విభేదించడాన్ని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ఫ్యాక్షనిస్టు నియంతలా పరిపాలిస్తున్నారని, ఎన్నికల నిర్వహణ కోసం చివరకు రాజ్యాంగం, నాయస్థానాలను సైతం జగన్ సర్కారు దిక్కరిస్తోందని ఆరోపించారు. వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీలను కూడా దోపిడీ పార్టీలుగా అభివర్ణించిన మావోయిస్టులు.. సదరు పార్టీలను తన్ని తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అలాగే,

నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు

రివ్యూ పిటిషన్లు వేయలేదేం?

రివ్యూ పిటిషన్లు వేయలేదేం?

ఎన్నికల సమయంలో జగన్.. విశాఖ మన్యంలో బాక్సైట్ తొవ్వకాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఇచ్చిన హామీలను కూడా మావోయిస్టులు లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తొవ్వకాల జీవో 97 రద్దు చేస్తామని చెప్పిన జగన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు మార్పులేమీ లేకుండా జీవో నెంబర్ 89 తీసుకొచ్చారని, ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు సహా అన్ని పోస్టులను నూటికి నూరు శాతం భర్తీ చేస్తామన్న హామీకి అనుగుణంగా జీవో నవంబర్ 3 జారీ చేశారని, అయితే న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని మావోయిస్టులు మండిపడ్డారు. ఇక..

వ్యాపారం కోసమే మూడు రాజధానులు..

వ్యాపారం కోసమే మూడు రాజధానులు..

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి సహా మూడు నగరాలను రాజధానులుగా ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపైనా మావోయిస్టులు ఆరోపణలు చేశారు. పరిపాలనా సౌలభ్యం కంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జగన్ సర్కారు మూడు రాజధానులంటూ నాటకాలు ఆడుతోందని మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ లేఖలో మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. కాగా..

అరుణ తలపై రూ.5లక్షల రివార్డు

అరుణ తలపై రూ.5లక్షల రివార్డు

ఏపీలో పంచాయితీ ఎన్నికలను బహిష్కరించాలంటూ తాజాగా లేఖ రాసిన మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ అలియాస్ వెంకటరావి చైతన్య తలపై ఇప్పటికే రూ.5లక్షల రివార్డు ఉంది. విశాఖ మన్యంలో పలువురు రాజకీయ నేతల హత్యల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ లో ఆంధ్రా-ఒడిశా బోర్డర్(ఏవోబీ)కి చెందిన కీలక మావోయిస్టు మహిళా నేతను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె అరుణే అని పార్టీ సానుభూతిపరులు ప్రకటనలు చేశారు. కానీ అరెస్టయిన మహిళ పేరు సాకె కళావతి అలియాస్ భవాని అని డీజీపీ గౌతం సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. పంచాయితీ ఎన్నికలపై మావోయిస్టల తాజా లేఖపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

English summary
Maoist party has warned to boycotting local body elections in Andhra Pradesh. A letter has been issued in the name of Maoist East Division Secretary Aruna calling for a boycott of the fake local body elections. The Maoists have leveled serious allegations and criticism against Chief Minister YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X