ఆగస్ట్ పెన్షన్లపై చంద్రబాబు కీలక నిర్ణయం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ సకాలంలో ఆగస్టు పింఛన్ అందేలాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా జరగాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఆగస్టు నెల ఒకటవ తేదీ ఉదయం 6గంటలకు పింఛన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పింఛన్ పంపిణీ ప్రక్రియకోసం సిబ్బందిని కేటాయించి లబ్ధిదారులకు పింఛన్ అందించే కసరత్తును ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది.

పింఛన్ ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం
ఏపీలో ప్రతిపక్ష పార్టీకి పింఛన్ల పంపిణీ విషయంలో ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో పింఛన్ పంపిణీ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. కచ్చితంగా ఒకటవ తేదీ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ మిస్ అయిన లబ్ధిదారులకు రెండవ తేదీ ఉదయాన్నే పింఛన్ అందేలా చూడాలని సూచనలు చేసింది.

AP pensions Update chandrababu key decision SERP CEO orders on august pensions distribution

ఆగస్ట్ 1న ఆరు గంటలకే పింఛన్ పంపిణీ షురూ
అంతేకాదు పింఛన్ పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన కఠినచర్యలు తప్పకుండా ఉంటాయని ఇప్పటికే ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ఇదే సమయంలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులంతా ఆగస్టు ఒకటవ తేదీ నాటికి తమ స్వగ్రామాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక పింఛన్ల పంపిణీ నేపథ్యంలో సెర్ప్ సీఈవో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పింఛన్లు పంపిణీ లో ఆగస్టు 1 2024న పంపిణీ కోసం నియమించబడినసిబ్బంది 6గంటలకే పంపిణీని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

పంపిణీ ఇలా
మొదటి రోజు 99% పంపిణీ పూర్తి కావాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందని అంతకుమించి పంపిణీ సమయం పొడిగింపు ఇవ్వబడదని పేర్కొన్నారు. మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీ పైన అన్ని గ్రామాలలో ప్రెస్ మరియు సోషల్ మీడియా తో పాటు బహిరంగ ప్రదేశాలలో చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ప్రతి పింఛనుదారునికి ఈ సమాచారం అందించాలని సూచించారు.

చెల్లింపులపై సెర్ప్ సీఈవో
90కంటే ఎక్కువ మంది పింఛన్ దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడినచోట అటువంటి మ్యాపింగ్ లు తగ్గించాలని, ఈ ప్రక్రియ నేడు పూర్తి చేయాలని ఆదేశించారు. సెక్రటేరియట్ వారిగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని ఎంపీడీవో, కమిషనర్లకు పంపబడ్డాయని ఈ మొత్తాలు 31-7-2024న సెక్రటేరియట్ బ్యాంకు ఖాతాలకు జమ చేయబడతాయన్నారు. ఇక బ్యాంకు ఖాతాలో జమైన నగదును 31వ తేదీన విత్డ్రా చేయాలని, ఒకటి, రెండవ తేదీలలో చెల్లింపులు చేయాలన్నారు.

మిగిలిన మొత్తం మళ్ళీ ఆన్లైన్ లో చెల్లించాలి
రెండవ తేదీన చెల్లింపు పూర్తి అయిన తర్వాత లబ్ధిదారులకు చెల్లించకుండా మిగిలిపోయిన మొత్తాన్ని రెండు రోజులలోపు సెర్ఫ్ కి తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. చెల్లించని పింఛన్లు అన్నింటిని చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకుముందు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీవోలు మరియు కమిషనర్లు మీ సెక్రటేరియట్ పరిధిలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణీని పర్యవేక్షించాలని మొదటి రోజునే పంపిణీ మొత్తం పూర్తి చేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+