మాస్కులు లేకుండా తిరిగితే జరిమానాల వీర బాదుడు ... కరోనా కంట్రోల్ కి ఏపీలో పోలీస్ మార్క్ కొరడా
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. జన సమర్ధం ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది . ఇదిలా ఉంటే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా రూల్స్ లో మాస్కులు ధరించటం పాటించని వారిపై పోలీస్ మార్క్ కొరడా
సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరి అని, చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం ముఖ్యమని ఈ జాగ్రత్తలు కరోనా మహమ్మారి నుండి కాపాడతాయని ఎంతగా చెప్తున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమకు ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని, మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు.

రేపటి నుండి ఏపీలో మాస్కులు లేకుంటే జరిమానాల వీర బాడుడే
ఇక నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా , హెల్మెట్ ధరించకున్నా మాత్రమే కాదు, ప్రజలు మాస్కులు ధరించకపోయినా ఫైన్ వెయ్యాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23 నుండి గ్రామాలలో మాస్కులు ధరించకుండా తిరిగిన వారికి ఐదు వందల రూపాయల జరిమానా, ఇక పట్టణాల్లో అయితే మాస్కులు లేకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులకు జరిమానా పుస్తకాలను కూడా పంపించారని సమాచారం .

పోలీసు జరిమానాల భయానికైనా మాస్కులు పెట్టుకుంటారా ?
దీంతో మాస్కులు లేకుంటే ఏపీలో ఇకనుండి బాదుడే అని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.
పోలీసులు ఫైన్ వేస్తారు అన్నకారణంతోనైనా అందరూ మాస్కులు ధరించాలని కోరుతున్నారు. అందరూ మాస్కులు ధరిస్తే కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడమే కాకుండా , పోలీసులు విధించే జరిమానాల నుండి కూడా కాపాడుకున్నవారవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసమే కాకుండా, పోలీసుల ఫైన్ ల బారినుండి కాపాడుకోవడానికి మాస్కులు పెట్టుకోండి మరి.












Click it and Unblock the Notifications