హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్: కెసిఆర్‌కు సిట్ నోటీస్, మత్తయ్య కాల్ డేటాకు నో?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకే కాకుండా ముఖ్యమైన నలుగురు అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ుై నమోదయిన కేసులపై సిట్, సీఐడీ అధికారులతో ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు సోమవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు భేటీ అయ్యారు. నోడల్ అధికారి ఇచ్చిన కాల్‌డాటాపై తెలంగాణలోని ఓ ఐపీఎస్ అధికారితోపాటు వీలైతే సీఎం కేసీఆర్‌కు కూడా నోటీలిసుల్వివాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, ఓటుకు నోటు కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరుసలెం కాల్‌డాటాను ఇవ్వలేమని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు ఏపీ సీఐడీకి చెప్పారని తెలిసింది. ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే మత్తయ్య విజయవాడలో ఫిర్యాదు చేశారనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. తదుపరి ఆ కేసును ఏపీ సీఐడీకి బదిలీ చేశారు.

AP police may issue notice to KCR on phone tapping

ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు సోమవారం సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను విచారించి మత్తయ్య సెల్‌ఫోన్‌కు సంబంధించిన కాల్ డాటా కావాలని కోరారని సమాచారం. అయితే తమకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయంటూ సర్వీస్ ప్రొవైడర్లు తిరస్కరించారని తెలిసింది.

ఒక నిందితుడికి సంబంధించిన కాల్‌డాటా ఎలా ఇస్తామంటూ ఏపీ సీఐడీ అధికారులను వారు ఎదురు ప్రశ్నించారని సమాచారం. ఇలా ఇస్తే తమకు న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలుంటాయని చెప్పినట్లు సమాచారం.

English summary
It is said that AP CID SIT may issue notice to Telangana CM K Chandrasekhar Rao in phone tapping issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X