కీలక నిర్ణయాలకు ఏపీ పార్టీల వెనకడుగు ! ఆ టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూపులు ?

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు స్తబ్దుగా మారిపోయాయి. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టినా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టడం మానేసి పూర్తిగా మౌనం వహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసు, ఇతరత్రా స్ధానిక అంశాలపైనే ఎక్కువగా చర్చ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలోనే టికెట్లు ఖరారు చేసి ఎన్నికలకు నేతల్ని సన్నద్దం చేసేందుకు ప్రయత్నించిన సీఎం వైఎస్ జగన్ కూడా తాజాగా మౌనం వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఆరునెలల క్రితం గమనిస్తే మూడు రాజధానుల వ్యవహారం లేదా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల అజెండాగా ఉంటాయని అంతా భావించేవారు. కానీ రెండు నెలలుగా పరిస్ధితుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ,జనసేన, బీజేపీ కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఆ విమర్శ రాకుండా అడపాదడపా కార్యక్రమాలు చేపడుతూ జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

partyflags

ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఈ ఏడాది ఆరంభంలోనే, అంటే మార్చి నెలలోనే టికెట్లు ఖరారు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆ మేరకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా, అందులో చురుగ్గా పాల్గొనని ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వనని కూడా తేల్చిచెప్పేశారు. దీంతో మిగతా పార్టీలు కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి. రాజకీయ కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్ధితి కనిపించడం లేదు.

అలాగే ప్రధాన విపక్షం టీడీపీ కూడా టికెట్ల ఖరారు, వచ్చే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పొత్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడుతోంది. రాబోయే రోజుల్లో పరిస్దితులు ఎలా మారతాయో తెలియని పరిస్దితుల్లో రిస్క్ చేయడం అవసరమా అన్న ఫీలింగ్ లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అటు లోకేష్ పాదయాత్ర చేస్తున్నా అది జనానికి రీచ్ అయ్యేలా ఎలాంటి ప్రత్యేక వ్యూహాలు అనుసరించడం లేదు. చంద్రబాబు టూర్లు చేస్తున్నా అప్పటికప్పుడు విమర్శలకే పరిమితం అవుతున్నారు.

మరోవైపు పొత్తులో ఉన్న జనసేన-బీజేపీ కూడా తమ పొత్తు ఎన్నాళ్లు ఉంటుందో తెలియని పరిస్దితుల్లో విడివిడిగానే కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కూడా సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అటు టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికలు దగ్గరపడ్డాక బీజేపీతో పొత్తు ఎలాగో కుదురుతుందన్న ధీమాలో కనిపిస్తోంది. వీటన్నింటికీ మించి వైఎస్ వివేకా కేసుతో పాటు కోడి కత్తి కేసుల్లోనూ వచ్చే తీర్పుల తర్వాత మారే రాజకీయ పరిస్దితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనలో అన్ని పార్టీలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+