విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల-91.84 శాతం ఉత్తీర్ణత-ఫలితాలు తెలుసుకోండిలా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఏపీ పాలిసెట్ 2022 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను ఇవాళ విజయవాడలో నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పరీక్ష రాసిన వారిలో 91.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశపరీక్షలను ప్రభుత్వం గత నెల 29వ తేదీన నిర్వహించింది. ఇందులో మొత్తం లక్షా 38 వేల 189 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్షా 31 వేల 627 మంది పరీక్ష రాశారు. వీరిలో 91.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 90.56 శాతం మంది బాలురు, 93.96 శాతం బాలికలు ఉత్తీర్ణులు అయ్యారు. వీరికి కేటాయించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.

AP POLYCET 2022 Results Released-91.84 percent candidates qualified, how to check result ?

ప్రస్తుతం సాంకేతి విద్యాకోర్సులకు తిరిగి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పాలిసెట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన వారి కోసం పాలిటెక్నిల్ కాలేజీలు వివిధ కోర్సుల్ని అందుబాటులో ఉంచాయి. వీటిలో ప్రవేశాలు పొందిన తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కోర్సుల్లోకి కూడా ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే తగ్గుతున్న ఉద్యోగావకాశాల కారణంగా పాలిసెట్ రాసే అభ్యర్ధుల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది.

పాలిసెట్ 2022 ఫలితాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ లో అవకాశం కల్పించింది. దీంతో పాటు పలు ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కింద వెబ్ సైట్లలో వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు...

https://polycetap.nic.in/Default.aspx

English summary
ap govt has released polycet 2022 results today in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X