తీరానికి సమీపించిన తుఫాన్- ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తరం ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్లా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది.
శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వ తుఫాను.. నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. శ్రీలంకలోని ట్రింకోమలికి పశ్చిమ-నైరుతి దిశలో 30, బట్టికలోవాకు వాయువ్య దిశలో 120, తమిళనాడులోని కారైకల్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 300, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 410, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయ దిశలో 510 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుఫాను శ్రీలంక తీరం, బంగాళాఖాతం నైరుతి- వాయువ్య దిశలో కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంత తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నేడు- చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అలాగే ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం నాడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ అయింది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతాయి.
అదేవిధంగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాన్.. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబండి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వీటి తీవ్రత క్రమంగా 70 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం నుండి గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 1 వరకు దక్షిణ ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications