తనకేమీ చాతకాదంటూ నిజం ఒప్పుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు!?
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పూర్తిగా సహనం కోల్పోయారు. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారని ఒకసారి విలేకరులను ప్రశ్నించారు. నేను సమాధానం చెప్పనని మరోసారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ సమాధానం చెప్పలేనపుడు ఇక్కడికి ఎందుకొచ్చారని తిరిగి విలేకరులు ప్రశ్నించారు. . 'అవును.. నాకు చేతకాదు' అంటూ ఆవేశంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డిసెంబరు 28న కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని, ఇరుకు రోడ్లలో రోడ్‌షో, డ్రోన్ షూట్ నిర్వహించడం వలనే తొక్కిసలాట జరిగిందని కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. కావాలనే పత్రికల్లో అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు.

కందుకూరు, గుంటూరు ఘటనల్లో పోలీసుల వైఫల్యమే కారణమని రాసిన సంపాదకీయాల్లో అభ్యంతరకర పదాలు ఉన్నాయని, జర్నలిజం పేరుతో ఇలాంటి రాతలు సరికాదని, రాజకీయ పార్టీకి కొమ్ముకాయాలనుకుంటే నేరుగా ముద్ర వేసుకోవాలని కటువైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు విలేకరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మీరు జర్నలిజంలో ఉంటూ ఓ పార్టీకి కొమ్ముకాయడం లేదా? అని ప్రశ్నించడంతోపాటు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అయి ఉండి రాష్ట్రంలోని విలేకర్లకు ఏం మేలు చేశారని నిలదీశారు. కరోనా సమయంలో ఎంతమందిని ఆదుకున్నారు? అక్రిడిటేషన్లు ఎంత మందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని మీడియా ప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావు సమాధానం చెప్పలేక 'అవును.. నాకు చేతకాదు' అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications