ఏపీని హెచ్చరించిన వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ప్రభావం కూడా ఏపీపై ఉంటుందని వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో నేడు వర్ష సూచన
ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం కోస్తా సముద్ర తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు వైపు వర్షాలు కురుస్తున్నాయి.

AP rains forecast today rains in these districts IMD warning

నేడు రాష్ట్రంలో వర్షాలు ఇక్కడే
జులై 13నుంచి జోరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు అర్థరాత్రి నుంచి వర్షాలు జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు ఈదురుగాలులు, పిడుగులతో నమోదవుతాయని చెప్తున్నారు. ఇక నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగులతో కూడిన వర్షాలు పడతాయన్న విపత్తుల నిర్వహణా సంస్థ
అంతేకాదు విజయనగరం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనంతోనూ వర్షాలు
ఇదిలా ఉంటే జులై 15వ తారీఖు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం విశాఖపట్నం, భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది. దీని ప్రభావం తో మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణాలలో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశంఉంది. రాయలసీమ లో కూడా మోస్తారు వర్షాలు నమోదవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+