ఏపీకి బంగాళాఖాతం ఇచ్చిన వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో అలాగే సోమ, మంగళవారాలలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కృష్ణ, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు జిల్లాలో జల్లులు పడుతున్నాయని గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
జులై 19 వరకు ఏపీలో వర్షాలు
ఈరోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి వర్షాలు జోరు పెరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈదురుగాలులతో పిడుగులతో కూడిన వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జులై 19 వరకు కృష్ణ, గుంటూరు, బాపట్ల, విజయవాడ ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాయలసీమ జిల్లాలలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను అనేక చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించారు.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆది, సోమవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ జిల్లాల ప్రజలకు రెయిన్ అలెర్ట్
అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణ, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్య సాయి, వైయస్సార్, అన్నమయ్య, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్ఆర్, అన్నమయ్య తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
వర్షాలకు కారణం బంగాళాఖాతంలోని వేర్వేరు ద్రోణులు
ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయని వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.












Click it and Unblock the Notifications