ఏపీకి భారీ వర్షాల తీవ్ర హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షాలు హెచ్చరికను చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో నిన్నటి నుంచి తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏపీలో మళ్ళీ భారీ వర్షాల హెచ్చరిక
బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్చిన్నతిలో కేంద్రీకృతమై మధ్య ట్రోపో ఆవరణం స్థాయిల వరకు ఆవర్తనం విస్తరించి ఉన్న కారణంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మళ్లీ సెప్టెంబర్ 23వ తేదీ వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP rains update Bay of Bengal has sent a severe warning of heavy rains to AP

నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
ఇక నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈ ప్రాంతాలలో నేడు తేలికపాటి వర్షాలు
అంతేకాదు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణ, బాపట్ల, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఇక సోమ, మంగళవారాలలో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది .

నిన్న ఏపీలో ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఇప్పటికే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనిఅల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల మరియు కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిశాయి. అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం, వైయస్సార్, చిత్తూరు, తిరుపతి అన్నమయ్య జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలకు కురిసాయి.

రానున్న మూడు నాలుగు రోజులు జాగ్రత్త
రానున్న మూడు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో వర్షాలు కురిసే ప్రాంతాలలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచన చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+