సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్- తేల్చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్..!!

పునర్విభజన చట్టంపై విచారణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని ఎనిమిదిన్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. రోజులు గడిచిపోతున్నాయే తప్ప- ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమౌతోంది.

సుప్రీంలో పిటీషన్..

సుప్రీంలో పిటీషన్..

ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది. పేరెన్స్ పేట్రియా కింద ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ నాజ్కీ ఈ పిటీషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు.

రాజ్యాంగం ప్రకారం..

రాజ్యాంగం ప్రకారం..

1,42,601 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల విభజన పూర్తి కావట్లేదని, ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టం చేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, సంవత్సరాలు గడుస్తోన్నప్పటికీ.. ఆస్తుల విభజన మాత్రం పూర్తికావట్లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద రాష్ట్రానికి, ప్రజలకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి పిటీషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లో..

మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లో..

తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టంగా పేర్కొంది. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఏప్రిల్ 11కు వాయిదా..

ఏప్రిల్ 11కు వాయిదా..

ఈ పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను విచారిస్తామని పేర్కొంది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పార్దీవాలా సారథ్యంలోని ధర్మాసనం సమక్షానికి ఈ పిటీషన్లు వెళ్లనున్నాయి. కాంగ్రెస్ కు చెందిన లోక్ సభ మాజీ సభ్యడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర ప్రతినిధులు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..

ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..

రాష్ట్ర విభజన సహేతుకంగా లేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన. తాజాగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ను కూడా దాఖలు చేసింది. విభజన సహేతుకంగా చోటు చేసుకోకపోవడం, సుదీర్ఘకాలంగా పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించలేకపోవడం.. వంటి చర్యల వల్ల ఏపీ నష్టపోతోందని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను కూడా ఇందులో పొందుపరిచింది.

స్వాగతించిన ఉండవల్లి..

స్వాగతించిన ఉండవల్లి..

తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేయడాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. హర్షం వ్యక్తం చేశారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుందని వ్యాఖ్యానించారు. దీన్ని శుభపరిణామంగా ఆయన అభివర్ణించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా సూచించినప్పటికీ ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+