ఆ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి విస్తరణకు, రవాణా సదుపాయాల మెరుగుదలకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం, రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు రహదారుల అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న రహదారులు మాత్రమే కాక కేంద్రం అభివృద్ధి చేస్తున్న నేషనల్ హైవే లపైన కూడా దృష్టి సారిస్తుంది.
కడప రాయచోటి రహదారి విస్తరణకు కేంద్రానికి విజ్ఞప్తి
ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి పైన న్యూఢిల్లీలోని ట్రాన్స్పోర్ట్ భవన్లో కేంద్ర రవాణా ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయన కేంద్రం ముందు ఒక కీలక విజ్ఞప్తిని ఉంచారు.కడప-రాయచోటి మార్గంలో ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో రహదారి విస్తరణకు కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆ టన్నెల్ ప్రాజెక్ట్ కు ఆమోదం కోరిన ఏపీ మంత్రి
2026-27 వార్షిక ప్రణాళిక కింద అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ మంత్రి కోరారు.కడప-రాయచోటి NH-40ను నాలుగు లేన్‌లుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. గువ్వల చెరువు 950 మీటర్ల టన్నెల్ ప్రాజెక్టుకు త్వరిత గతిన ఆమోదం ఇవ్వాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా మంత్రి కేంద్రం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టారు.
రహదారి ప్రాజెక్టులను వేగవంతం చెయ్యాలన్న మంత్రి
ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవే ల అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో ప్రాజెక్టులను వేగవంతం చేసి త్వరితగతిన ఆధునిక రవాణా సదుపాయాలు అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తిరుపతికి ఆధునిక రవాణా సదుపాయాలు అందించాలని కోరిన మంత్రి
తిరుపతి ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్, రూ.500 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతిలో బస్ టెర్మినల్ అభివృద్ధి, సహా కీలక ప్రాజెక్టులపై సమీక్ష జరిపిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర రవాణా, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, తిరుపతికి ఆధునిక రవాణా సదుపాయాలు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications