శారదాపీఠంలో ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగం-శ్రీనివాసానంద సరస్వతి వార్నింగ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పరపతిని వాడుకుని తిరుమలలోని శారదాపీఠంలో చేపట్టిన నిర్మాణాలపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర అభ్యతరం తెలిపారు. ఇవాళ వాటిని పరిశీలించిన ఆయన.. అక్రమణలను కూల్చకపోతే ప్రాణత్యాగం చేసుకుంటానని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే శారదాపీఠం విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరున్న స్వరూపానంద దీన్ని నిర్వహిస్తున్నారు.
విశాఖలోని శారదా పీఠానికి అనుబంధంగా తిరుమలలో నిర్మించిన శారదాపీఠంపై సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగం చేసుకొంటానన్నారు. తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చారని విమర్శించారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదన్నారు. అలాగే పూజలు చేయడం లేదన్నారు.

తిరుమల శారదా పీఠానికి 4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారని శ్రీనివాసానంద ఆరోపించారు.గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని కూడా ఆరోపించారు. వీటిని ప్రభుత్వం కూల్చేయాలని ఆయన కోరారు. లేకపోతే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications