AP Schools: ఏపీ స్కూళ్లలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ వాయిదా-తిరిగి ఎప్పుడంటే ?
ఏపీలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ విద్యార్ధులకు పరీక్షల తర్వాత ఏటా నిర్వహించే పేరెంట్-టీచర్ మీటింగ్ పై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది వార్షిక పరీక్షల తర్వాత విద్యార్ధులకు ఏప్రిల్ 23న పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ముందుగా నిర్ణయించిన అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ మీటింగ్స్ పై అధికారులు ఇవాళ మరో నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 23న పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని భావించినా.. ఇందులో స్వల్పమార్పు చేయాల్సి వచ్చిందని విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ 23న విద్యార్దులకు ప్రోగ్రెస్ కార్డుల్ని మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నిర్వహించే పేరెంట్-టీచర్ మీటింగ్ ను మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే మార్కుల్నివెబ్ సైట్ లో అప్ లోడ్ మాత్రం చేయాలన్నారు.

గతంలో ఏప్రిల్ 23న షెడ్యూల్ చేసిన పేరెంట్-టీచర్ మీటింగ్ ను ఎన్నికల ముగిసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు మే13న జరగనుండగా.. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు. ఆ తర్వాత జూన్ 11 వరకూ ఎన్నికల కోడ్ ఉంటుంది. దీంతో జూన్ 12న స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని ప్రవీణ్ ప్రకాష్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అదే రోజు వచ్చే విద్యాసంవత్సరం మొదలు కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications