AP Schools Reopen Date: జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిల్ ; మొదలైన రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విద్యార్థులు విద్యా సంవత్సరానికి నష్టపోతున్నారని, ఆఫ్ లైన్ విద్యావిధానాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుండి పాఠశాలల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ తరగతులను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ పై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇది జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తుంది.

ఏపీ స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో గందరగోళం
తాజాగా ఏపీలో విద్యార్థులు స్కూల్స్ రీ ఓపెన్ విషయంలోనూ గందరగోళం నెలకొంది. కొందరు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో స్కూల్స్ నిర్వహించటం అవసరమా అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు ఇప్పటికే విద్యార్థులు చదువులు మరిచిపోతున్నారని, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెబుతోంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం అనేక వినూత్న ప్రయోగాలను చేస్తోంది. విద్యా ప్రమాణాలను పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.

నాడు నేడు ద్వారా స్కూల్స్ కు కొత్త కళ .. చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న సర్కార్
ఇదే సమయంలో పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం కూడా ఏపీ సర్కార్ నాడు నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది. నాడు నేడు ద్వారా పాఠశాలలో రూపురేఖలను మార్చి, ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన, అధునాతనమైన విద్యావిధానాన్ని ప్రభుత్వ పాఠశాలలలో అందించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ మొదటి విడతగా 15,715 పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చి మరో రెండు రోజుల్లో విద్యార్థులకు స్వాగతం పలుకనుంది .అధునాతన సౌకర్యాలతో, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలను మార్చేసిన సర్కార్ , మొత్తం 15,715 పాఠశాలలకు 3,585 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేసింది. పాఠశాలల భవనాలను రిపేర్ చేయించడమే కాకుండా, ఆధునికత ఉట్టిపడేలా, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దింది.

ఏపీలో 16 నుండి స్కూల్స్ ... స్కూల్స్ నిర్వహణపై నిపుణుల అభిప్రాయం
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభించిన కారణంగా పాఠశాలలను క్లోజ్ చేసి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కేసుల తగ్గుదల నేపథ్యంలో తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆరు నూరైనా 16వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో భౌతిక తరగతులు నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ఇప్పటికి కూడా పాఠశాలలను ప్రారంభించకుంటే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారుతుందని, తగిన జాగ్రత్తలతో పాఠశాలలను పున ప్రారంభించాల్సిన విషయంపై ఆలోచన చేయాలని డబ్ల్యూహెచ్వో నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
ఇదిలా ఉంటే ఏపీలో స్కూల్స్ ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉపాధ్యాయులందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి ముందే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే పాఠశాలలను ప్రారంభించాలని కోర్టు మెట్లు ఎక్కారు. శ్రీకాకుళానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం గమనార్హం .ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ లను ప్రతివాదులుగా పేర్కొంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై కోర్టు పిటిషనర్ తరపున వాదనలు విని, ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.

ఉపాధ్యాయులకు పూర్తిగా వ్యాక్సినేషన్ ఇచ్చాకే స్కూల్స్ ప్రారంభించాలని పిటీషన్ 18 కి విచారణ వాయిదా
ఉపాధ్యాయులు ప్రతి రోజూ వందల మంది విద్యార్థులతో మాట్లాడుతున్నారని అందువల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. పిటిషనర్ల తరపున వాదనలు విన్న ధర్మాసనానికి ఇప్పటికే ఉపాధ్యాయులకు 85% వ్యాక్సినేషన్ పూర్తిచేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. మిగతా వారికి కూడా త్వరితగతిన వ్యాక్సినేషన్ పూర్తి చేశామని వెల్లడించారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి కాస్త సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ఈ కేసును ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టులో వేసిన పిల్ పై భిన్నాభిప్రాయాలు
అయితే ఈనెల 16వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్స్ రీ ఓపెన్ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించలేదు. దీంతో 16వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్కూల్ రీ ఓపెన్ చేయొద్దని హైకోర్టు మెట్లెక్కిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కొందరు తల్లిదండ్రులు స్కూల్ రీ ఓపెన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటే, మరికొందరు కరోనా నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే భయపడుతున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం స్కూల్స్ నిర్వహణ విషయంలో కృత నిశ్చయంతో ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications