వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిషత్ పోరు: ఏప్రిల్ 8న పోలింగ్ -నోటిఫికేషన్ జారీ -ఆగిన చోట నుంచే ఎన్నికలు -ఎస్ఈసీ నీలం సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచి ప్రక్రియ పున:ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు పెట్టాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా, శుక్రవారం ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపు ఇచ్చినప్పటికీ, కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని అర్ధాంతరంగా నోటిఫికేషన్ జారీ చేసేయడం గమనార్హం.

పరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలనం -బహిష్కరణంటూ లీకులు -ఎస్ఈసీ మీటింగ్ తర్వాతేనన్న అచెన్నాయుడుపరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలనం -బహిష్కరణంటూ లీకులు -ఎస్ఈసీ మీటింగ్ తర్వాతేనన్న అచెన్నాయుడు

ఏప్రిల్ 8న పోలింగ్...

ఏప్రిల్ 8న పోలింగ్...

ఏపీలోని 653 జెడ్పీటీసీ, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రమంతటా ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా అవాంతరాలు ఏర్పడితే, ఆయా స్థానాల్లో ఏప్రిల్ 9న రీపోలింగ్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 10న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని, తదనుగుణంగా ఫలితాల వెల్లడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఆగిన చోట నుంచే ఎన్నికలు..

ఆగిన చోట నుంచే ఎన్నికలు..

ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి గతేడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఏకగ్రీవాలు కూడా ఖరారై, మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల తుది జాబితా విడుదలైన తర్వాత అంటే, మార్చి 14న ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. గతేడాది ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయాయో, అక్కడి నుంచే ప్రక్రియ పున:ప్రారంభం అవుతుందని గురువారం నాటి నోటిఫికేషన్ లో ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది.

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ ముగిశాక..

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ ముగిశాక..

నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని తొలిరోజైన గురువారమే పరిషత్ ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల సన్నద్ధతపై వివరాలు సేకరించారు. జిల్లాల అధికారులతో మీటింగ్ లో పరిషత్ ఎన్నికలపై సానుకూలత వ్యక్తమైందని, కాబట్టే ఇవాళే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ఎస్ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే..

అమలులోకి ఎన్నికల కోడ్..

అమలులోకి ఎన్నికల కోడ్..

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో గురువారం నుంచే రాష్ట్రమంతటా ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులోకి వస్తుందని ఎస్ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజలు విధిగా కోడ్ ను పాటించాల్సి ఉంటుంది. పరిషత్ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అధికార వైసీపీ బలవంతంగా ఏకగ్రీవాలు చేయించిందని అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఏపీ హైకోర్టు కొట్టేయడం, ఏకగ్రీవాలను ప్రకటించాల్సిందేనని తీర్పు చెప్పిన దరిమిలా కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ..

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ ముగిశాక..

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ ముగిశాక..

నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని తొలిరోజైన గురువారమే పరిషత్ ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల సన్నద్ధతపై వివరాలు సేకరించారు. జిల్లాల అధికారులతో మీటింగ్ లో పరిషత్ ఎన్నికలపై సానుకూలత వ్యక్తమైందని, కాబట్టే ఇవాళే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ఎస్ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే..

నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారానీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారా

English summary
Andhra Pradesh State Election Commission (ap sec) has released notification for zptc and mptc election on thrusday. polling date for the parishat elections is april 8th and the counting will be conducted on april 10th. sec has now decided to resume the election process of MPTCs and ZPTCs from the stage where it was stopped on 15.03.2020 and complete the process, sais notification. after conference with all district collectors and sps, ap sec neelam sahni made her call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X