ట్యాపింగ్: కెసిఆర్ ప్రభుత్వంపై ఏపీ వద్ద కీలక ఆధారాలు, ప్రణబ్ వద్దకు!
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమ వద్ద కెసిఆర్ ప్రభుత్వం కూలే ఆధారాలున్నాయని చెబుతున్న ఏపీ మంత్రులు అందుకు సంబంధించిన ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతిని ఏపీ మంత్రులు, ఇతర టీడీపీ నేతలు సోమవారం లేదా మంగళవారం కలవనున్నారు.
హైదరాబాదులో సెక్షన్ 8 గురించి వారు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి చెందిన ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఫిర్యాదు చేయనున్నారు.

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమ వద్ద కీలక ఆధారాలున్నాయని ఏపీ మంత్రులు చెబుతోన్నారు. ఆధారాలను తాము తెలంగాణ ప్రభుత్వం మీడియాలో హైలెట్ చేసినట్లుగా చేయమని, సమయం వచ్చినప్పుడు బయటపెడతామని వారు గతంలో చెప్పారు.
ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి వారి వద్ద ఉన్న కీలక ఆధారాలు ప్రణబ్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ట్యాపింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు ఏపీ వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆ ఆధారాలతో ప్రణబ్‌కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఇరకాటం కారణంగానే కెసిఆర్ ఓటుకు నోటు కేసులో తగ్గారనే వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతికి అందుకు సంబంధించిన ఆధారాలు కెసిఆర్‌ను చిక్కుల్లో పెట్టేవిగా ఉంటాయా లేదా తెలియాల్సి ఉంది!












Click it and Unblock the Notifications