అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు..ఓట్లు వేయకపోయిన పర్వాలేదు

గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఐదు నెలలు దాటింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయిలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది.

అయితే పెన్షన్లను లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలకు తగ్గిపోతూ వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారి కన్నా తక్కువ మందికి పెన్షన్ల ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో ప్రతినెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జగన్ ప్రభుత్వంలో మే నెలలో పెన్షన్ పంపిణీ 65 ,49 ,864కి పంపిణీ చేయగా, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 64,14,174 మందికి పెన్షన్‌ అందజేశారు.అయితే డిసెంబర్ నెలకు వచ్చే సరికి ఈ సంఖ్య 63 ,92 ,702మందికి చేరింది. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు ఉన్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

AP Speaker Ayyanna Patrudu sensational comments on pensions

పెన్షన్లను వేయి రూపాయిలు పెంచారని ఆనందపడేలోపే, లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగించి లెక్కలను సరి చేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది.తాజాగా పెన్షన్లపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ. 7 వేల కోట్లు దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో తాను అంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని, తన స్టైలే వేరన్నారని చెప్పారు. రూ.7 వేల కోట్లతో తాండవ రిజర్వాయర్లలాంటివి మూడు కట్టొచ్చన్నారు. అలాగే యువత పాడైపోతుందని వ్యాఖ్యానించారు. గంజాయి, మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని చెప్పారు. ఇదేంటని అడిగిన వారిని చితకబాదుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తే చూద్దాములే అన్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+