జగన్ సర్కార్ కు షాక్; ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు చెప్పినా కేంద్రానిది అదే మాట!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పదే పదే తేల్చి చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అంశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కలలాగానే మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పదే పదే తేల్చి చెప్తుంది.

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ .. ప్రత్యేక హోదా లేనట్టే అంటున్న కేంద్రం

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ .. ప్రత్యేక హోదా లేనట్టే అంటున్న కేంద్రం


ఏపీలో అధికారంలోకి వచ్చే ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా. ఎలాగైనా ఏపీకి హోదా సాధించి తీరుతామని, అది కేవలంవైసీపీ వల్లనే సాధ్యమని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు కేంద్రంపై బలంగా పోరాటం చెయ్యలేకపోయింది. ఇక ఇటీవల కాలంలో రాష్ట్రపతి ఎన్నికలలోను ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపి, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించినప్పటికీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని మళ్లీ చెప్పడం ఏపీ ప్రభుత్వానికి షాక్ అని చెప్పాలి.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం


ఇక తాజాగా జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో కూడా కేంద్రం మరోమారు ప్రత్యేక హోదా అంశంపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని ఆయన ఆ సమాధానంలో పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని, మరి కొన్ని హామీలు మాత్రమే మిగిలి ఉన్నాయని కేంద్రం పేర్కొంది .

 ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు వివిధ దశల్లో ఉన్నాయన్న కేంద్రం

ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు వివిధ దశల్లో ఉన్నాయన్న కేంద్రం


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో పొందుపరిచిన అనేక అంశాలు ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎటువంటి తేడా ను 14వ ఫైనాన్స్ కమిషన్ చూపలేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తీరును కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల్లో వాటా, లోటు సర్దుబాటు నిధులు, రెవిన్యూ లోటు కూడా అందజేసినట్టు కేంద్రం ప్రకటించింది.

 మళ్ళీ ఏపీ ఆశలపై నీళ్ళు చల్లిన కేంద్రం

మళ్ళీ ఏపీ ఆశలపై నీళ్ళు చల్లిన కేంద్రం


విభజన చట్టం అమలుపై ఇప్పటికి ఇరవై ఎనిమిది సార్లు సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ లో ఎవరు దీనిపై ప్రశ్నించినా కేంద్రం నుండి ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని మాత్రమే వస్తుంది. దీంతో మరోమారు కేంద్రం ఏపీ ప్రత్యేక హోదా ఆశలపై నీళ్లు చల్లినట్టు తాజా సమాధానంతో అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+