AP SSC results 2023 : రేపే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల- పూర్తి వివరాలివే..

ఏపీలో ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. పరీక్ష రాసిన విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల తేదీని ఇవాళ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో జరుగుతున్న భేటీలో విద్యామంత్రి బొత్స దీనిపై కీలక ప్రకటన చేశారు. దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

AP SSC results 2023

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను రేపు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాల ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు బొత్స ఇవాళ ఉపాధ్యాయ సంఘాలకు తెలిపారు.

ఏపీలో ఈ ఏడాది మొత్తం 6.5 లక్షలకు పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. ప్రభుత్వం 3349 కేంద్రాల్లో వీటిని నిర్వహించింది. లీకేజీల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుని మరీ ఈసారి పరీక్షలు నిర్వహించారు. గత నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకూ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టింది. అది కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఫలితాలకు రంగం సిద్ధం చేసింది.

ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం రేపు ఈ ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్ వివరాలను కూడా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం పదో తరగతి పరీక్షా ఫలితాలు www.results.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతారు. అలాగే పలు ప్రైవేట్ వెబ్ సైట్లు కూడా ఫలితాలను అందించేందుకు సిద్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+