అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

19న జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ - సాయంత్రానికే ఫలితాలు : ఏకపక్షమంటూ వైసీపీ ధీమా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో చాలా రోజులుగా పూర్తి కాని ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కు ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ను రద్దు చేస్తూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీని పైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. పిటీషనర్లు..ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో..తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసి పుచ్చింది. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇచ్చింది.

19న కౌంటింగ్..నోటిఫకేషన్ జారీ

19న కౌంటింగ్..నోటిఫకేషన్ జారీ

దీంతో..ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి 10న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ, న్యాయస్థానం ఆదేశాలతో వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు నుంచి క్లియరెన్స్ రావటంతో ఎన్నికల సంఘం ఈ నెల 19న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసారు. కోర్టు తీర్పు మేరకు పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

కౌంటింగ్ పైన మార్గదర్శకాలు జారీ

కౌంటింగ్ పైన మార్గదర్శకాలు జారీ

విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు. కోర్టు తీర్పు వచ్చే సమయానికి ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. అధికారుల నుంచి కోర్టు తీర్పు.. కౌంటింగ్ పైన సన్నద్దత పైన వివరాలు సేకరించారు. దీంతో..19న కౌంటింగ్ చేపట్టాలని నిర్ణయించారు.

నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్

నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్

ఈ రోజు ఉదయం కౌంటింగ్ ఏర్పాట్ల పైన జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్.. సీఎస్ దాస్.. పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. మొత్తం 515 జెడ్పీటీసీ...7,220 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 2,371 ఏకగ్రీవం అయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్దులు మరణించటంతో ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో అదే విధంగా 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 126 ఏకగ్రీవం అయ్యాయి. 8 చోట్ల ఎన్నికలు జరగలేదు. 11 చోట్ల అభ్యర్దుల మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఫలితాలు ఏకపక్షమే అంటూ వైసీపీ ధీమా

ఫలితాలు ఏకపక్షమే అంటూ వైసీపీ ధీమా


ఇక, కౌంటింగ్ ప్రారంభమైన తరువాత సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో, పోటీ చేసిన అభ్యర్ధుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో జరిగిన పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన వైసీపీ ఈ ఫలితాలు తమకు ఏకపక్షంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది. దీని కారణంగా నే ఎన్నికలు అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేసాయని వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. జెడ్పీటీసీ..ఎంపీటీసీలు ఏకగ్రీవం జరిగిన వాటిలో మెజార్టీ వైసీపీ దక్కించుకున్నవే. ఇక, ఇప్పుడు వెల్లడయ్యే ఫలితాలు సైతం అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మంత్రుల్లో కొత్త టెన్షన్..

మంత్రుల్లో కొత్త టెన్షన్..

ఈ ఫలితాలు సైలం వెల్లడైన తరువాత మంత్రుల పని తీరు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పంచాయితీ..మున్సిపల్... పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గాలు-జిల్లాల వారీగా ఫలితాల పైన విశ్లేషణ ఉంటుందని ఈ ఎన్నికల ప్రారంభానికి ముందే సీఎం స్పష్టం చేసారు. అయితే, పంచాయితీ..మున్సిపల్ ఫలితాల్లో మంత్రులకు ఎటువంటి టెన్షన్ లేకుండా పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక, ఇప్పుడు ఈ ఫలితాల వెల్లడి తరువాత సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది.

Recommended Video

Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu
సీఎం జగన్ తాజా వ్యాఖ్యలతో రాజకీయ వేడి

సీఎం జగన్ తాజా వ్యాఖ్యలతో రాజకీయ వేడి

ఇదే సమయంలో స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో..అప్పుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం సీఎం జగన్ కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఆ దిశగా మంత్రులకు సంసిద్దత సంకేతాలు ఇచ్చారు. దీంతో..ఏపీలో కరోనా కారణంగా రాజకీయంగా కొంత స్తబ్దుత కనిపింపిని..ఇప్పుడు ఈ ఫలితాలు.. తాజాగా సీఎం వ్యాఖ్యలతో మరింతగా రాజకీయ సందడి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

English summary
AP state Election commission decided to conduct counting for ZPTC and MPTC on 19 th of this month. After high court judgement on these elections, SEC issued notification for counting process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X