'ప్రశాంత్ కిషోర్ టిడిపి గెలుస్తుందంటే, కేసీఆర్ జగన్ గెలుస్తాడని చెప్పడమా'
ఏపీలో టిడిపి కంటే వైసిపికి ఎక్కువ ఓట్లు వస్తాయని తన మిత్రుడి సర్వేలో తేలిందన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ టిడిపి నేతలు శుక్రవారం మండిపడ్డారు.
అమరావతి: ఏపీలో టిడిపి కంటే వైసిపికి ఎక్కువ ఓట్లు వస్తాయని తన మిత్రుడి సర్వేలో తేలిందన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ టిడిపి నేతలు శుక్రవారం మండిపడ్డారు.
చదవండి: పవన్ ప్రభావం ఉండదు, సర్వేలో జగన్‌కే 45 శాతం: కేసీఆర్ సంచలనం, ఏపీ కుల రాజకీయాలపై..
జగన్ కోసం కేసీఆర్ సర్వేలు చేస్తున్నట్లుగా ఉందని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వీలు చిక్కితే బాబుపై విరుచుకుపడే కేసీఆర్, జగన్‌ను మాత్రం పల్లెత్తు మాట అనడన్నారు. 2019లో టిడిపిదే అధికారం అని ప్రశాంత్ కిషోర్ చెబుతుంటే కేసీఆర్ చిలక జోస్యం చెబుతున్నారన్నారు.

కేసీఆర్ అవివేకం
ప్రతిపక్ష నేతగా పనికిరాని జగన్‌ను సీఎంగా ఊహించుకోవడం కేసీఆర్ అవివేకమని మంత్రి జవహర్ అన్నారు. కేసీఆర్, జగన్ సంబంధాలు మరోసారి బయటపడ్డాయన్నారు.
ఫాంహౌస్‌ను వీడి కేసీఆర్ జ్యోతిష్యాలయం పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ ఇలాంటి జ్యోతిష్యాలే చెప్పారని, అభాసుపాలయ్యారన్నారు. 25 ఏళ్ల పాటు ఏపీలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, అప్పటి వరకు చంద్రబాబే సీఎం అన్నారు.












Click it and Unblock the Notifications