ప్యారడైజ్ పేపర్లపై జగన్ సమాధానం చెప్పాలి: కళా వెంకట్రావు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నాయకుడికి నిబద్ధత.. పార్టీకి ఓ పాలసీ ఉండాలని.. వైసీపీ అధినేత జగన్‌కు ఆ రెండు లేవని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీకి హాజరుకాకుండా పాదయాత్రలు చేయడం వల్ల ఏం సాధిస్తారని జగన్‌ను ప్రశ్నించారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొంది. జగన్‌కు పదవీ కాంక్ష తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని అన్నారు. పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారంటే ప్రతీ ఒక్కరు పాదయాత్రలే చేస్తారని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

Ap TDP president Kalavenkat Rao demands jagan explain paradise papers

ప్యారడైజ్ పేపర్లో జగన్‌ పేరు ప్రస్తావించడంపై, ప్రజల మధ్యలో ఉన్న ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ సాక్షిగా వివరిస్తామన్నారు.

జగన్ సీఎం కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.అనంతపురం జిల్లాలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పల్లెరఘునాథ్‌రెడ్డి జగన్‌పై విమర్శలు గుప్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap TDP chief Kala Venkat Rao made allegations on Ysrcp chief Ys Jagan. Kala Venkat Rao demanded jagan explain on paradise papers . He spoke to media on Tuesday at Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి