వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్ : ఏపీకి నలుగురు, తెలంగాణ ముగ్గురు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే మరో ఏడుగురు కొత్త ఐపీఎస్ అధికారుల నియామకం జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు. నగరంలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్ ల శిక్షణా కాలం ముగియడంతో.. వారిని ఆయా రాష్ట్రాలకు కేటాయించనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయించనుండగా.. ఇందులో తెలంగాణకు ముగ్గురు, ఏపీకి నలుగురిని కేటాయించనున్నారు. ఏపీకి కొత్తగా నియామకం కానున్న నలుగురు ఐపీఎస్ ల్లో ఇద్దరు అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అలాగే తెలంగాణకు కేటాయించనున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరు తెలంగాణకే చెందినవారు కావడం గమనార్హం.

AP, Telangana Get 7 new IPS Officers

ఇదిలా ఉంటే.. 124 మంది ఐపీఎస్ ల శిక్షణా కాలం ముగిసిన సందర్బంగా.. ఈ నెల28న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ అధికారులు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నట్లు అరుణ బహుగుణ తెలిపారు.

ఏపీకి కొత్తగా కేటాయించనున్న ఐపీఎస్ అధికారులు :

అజిత వేజెండ్ల (ఏపీ),
గౌతమి సాలి(ఏపీ),
ఆరిఫ్ హఫీజ్ (కర్ణాటక),
బరుణ్ పురకాయస్త (అస్సాం)

తెలంగాణకు కొత్తగా కేటాయించనున్న ఐపీఎస్ అధికారులు :
చేతన మైలమత్తుల (తెలంగాణ),
రక్షిత కె.మూర్తి (కర్ణాటక),
పాటిల్ సంగ్రామం సింగ్ గణపతిరావు (మహారాష్ట్ర)

English summary
Andhra Pradesh and Telangana states have been allocated with 7 new IPS officers, who just completed their training at National Police Academy in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X