ఏపీలో ఈసారి పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు ఇవి తప్పనిసరి..!
ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అసలే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అధికార వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటం, విపక్షాలు వీరిపై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటంతో కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో సెల్ప్ దీనికి అనుగుణంగా సర్కులర్ విడుదల చేసింది. ఇప్పటికే ఈసారి పెన్షన్ల పంపిణీ రెండు రోజులు ఆలస్యమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచిన ఈసీ.. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లతో పాటు వాటిని బ్యాంకుల నుంచి డ్రా చేసే సచివాలయ సిబ్బందికి సైతం ఆథరైజేషన్ ను తప్పనిసరి చేసింది. వీరిపై ఉన్నతాధికారులుగా ఉన్న ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి.. సంక్షేమ కార్యదర్శులకు ఆథరేజైషన్ జారీ చేయాలని సెర్ప్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో వాలంటీర్లతో పాటు సచివాలయ విధుల్లో ఉన్న సంక్షేమ కార్యదర్శులు కూడా ఈ ఆథరేజేషన్ తీసుకుంటేనే పింఛన్ల వ్యవహారంలో తలదూర్చేందుకు వీలుంటుంది. లేకపోతే ఎన్నికల కోడ్ మేరకు వీరిని దూరంగా ఉంచాల్సిన పరిస్దితి. దీంతో వాలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులకు ఈ మేరకు ఆథరేజేషన్ తీసుకోవాలని సెర్ప్ నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ లోపు వీరు తప్పనిసరిగా ఆథరేజేషన్ తీసుకుంటేనే పెన్షన్ల సజావుగా పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications