Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాజాగా జలవివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నీటిని ఏపీ తరలించుకుపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదాన్ని రేకెత్తించింది. ఏపీ నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లో నాలుగు టీఎంసీల నీటిని తరలించుకుపోవడంతో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి.

టెయిల్ పాండ్ నుంచి నీటిని తరలించుకున్న ఏపీ
నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లోని నీటిని ఏపీ పూర్తిగా వినియోగించుకుంది. దీంతో నాగార్జునసాగర్ దిగువన నిర్మించిన టెయిల్ పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకు పోయిందని కృష్ణ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈనెల 12వ తేదీన టెయిల్ పాండ్ లో నిల్వ ఉన్న ఏడు టీఎంసీలలో నాలుగు టీఎంసీలను దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు ఏపీ అధికారులు విడుదల చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది.

AP water theft from Nagarjuna Sagar tail pond Krishna water dispute during elections

విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే జలాలు టెయిల్ పాండ్ లోకి
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్టానికి చేరుకున్నప్పుడు నాగార్జునసాగర్ నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీటిని, వృధా చేయకుండా టెయిల్ పాండ్ కు తరలించి దీని నుండి తిరిగి రివర్స్ పంపింగ్ ద్వారా సాగర్లోకి ఎత్తి పోసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. సాగర్ నుండి 21 కిలోమీటర్ల పొడవున ఈ టెయిల్ పాండ్ ఉండగా దీనిని తెలంగాణ జెన్కో పర్యవేక్షిస్తోంది.

కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు
అయితే ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏపీ ఈ నీటిని తరలించడం పైన ఈనెల 15న అధికారులు ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. దీంతో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏపీ చేసిన ఈ పని వలన తెలంగాణా లోని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులకు తాగునీటి కటకట నెలకొంది.

ఏపీ నీటి చౌర్యం తెలంగాణా మంత్రుల అసమర్ధత వల్లే అన్న జగదీశ్ రెడ్డి
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఏపీ నీటి చౌర్యం పైన తెలంగాణ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ అసమర్థత వల్లే నీటి చౌర్యం జరిగిందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి ప్రధాన బాధ్యులు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+