
ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు: వాయుగుండంగా అల్పపీడనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వచ్చే మూడు రోజులపాటు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ సముద్రం, పక్కనే ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం, మలక్కా జల సంధి గుండా కొనసాగుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 5 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 7వ తేదీన ఉదయం నాటికి ఇదిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

డిసెంబర్ 8వ తేదీన ఉదయం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని ఆనుకుని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీ, యానాంలలో దిగువ ట్రోవో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.
ఉత్తరకోస్తాంధ్రలో
ఆదివారం
తేలికపాటి
నుంచి
మోస్తరు
వర్షాలు
కురిసే
అవకాశం
ఉంది.
సోమ,
మంగళవారాల్లో
పొడి
వాతావరణం
ఉండనుంది.
దక్షిణ
కోస్తాంధ్రలో
ఆది,
సోమవారాల్లో
తేలికపాటి
నుంచి
మోస్తరు
వర్షాలు
పలు
ప్రాంతాల్లో
కురిసే
అవకాశం
ఉంది.
మరోవైపు, రాయలసీమలో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. పిల్లలు, శాస సమస్యలు ఎదుర్కొంటున్నవారు చలి తీవ్రత ఎక్కువ ఉండే ఉదయం, రాత్రిపూట తిరగకూడదని సూచించారు.