ఘోరం..మంటల్లో కాలిబూడిదైన వ్యాపారి...సూసైడ్ గా అనుమానం...
పశ్చిమగోదావరి: భీమవరం లోని భీమేశ్వర స్వామి గుడి సమీపంలో ఒక ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తటవర్తి సూర్యనారాయణ అనే 60 సంవత్సరాల కిరాణా వ్యాపారి సజీవదహనమయ్యాడు.
అయితే ఈ అగ్ని ప్రమాదం ప్రమావదశాత్తూ సంభవించిందా లేక అతడే ఆత్మహత్య చేసుకునేందుకు నిప్పంటించుకోవడం వల్ల అలా జరిగిందా అనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడేవుండొచ్చని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు.
తనను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేయటం వల్ల అతడు మనోవేదనకు గురై ఇలా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఏదేమైనా వ్యాపారి సజీవ దహనం కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.












Click it and Unblock the Notifications