రాహుల్ ను వెనక్కి నెట్టేస్తారా ? ఇదేం చిల్లర రాజకీయం-మోడీపై షర్మిల ఫైర్..!
ఇవాళ ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఎర్ర కోట వద్ద వేడుకలకు హాజరైన రాహుల్ గాంధీకి తన ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా కేంద్రం ఎక్కడో వెనుక సీటు కేటాయించింది. వాస్తవానికి ప్రధాని తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన రాహుల్ గాంధీని మంత్రులతో సమానంగా సీటు కేటాయించాల్సి ఉండగా.. రెండో వరుసలో ఇచ్చారు.
రాహుల్ గాంధీకి రెండో వరుసలో సీటు కేటాయించడంతో అక్కడే మరికొందరు ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి కూర్చొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కేంద్రం తీరుపై ఆమె విరుచుకుపడ్డారు.నరేంద్రమోదీ గారూ.. భారతదేశ ప్రజలు, మన రాజ్యాంగం రాహుల్ గాంధీకి లోక్ సభలో విపక్ష నేత పదవి అప్పగించారని షర్మిల గుర్తుచేశారు. ఇది మీకు ఆమోదయోగ్యమైనదిగా అనిపించినా, అనిపించకపోయినా తప్పనిసరిగా అంగీకరించవలసిన వాస్తవం అన్నారు.

Modi ji, the people of India and our Constitution have entrusted @RahulGandhi ji with the role of "Leader of the Opposition." Whether you find this agreeable or not, it remains a reality that must be acknowledged.
— YS Sharmila (@realyssharmila) August 15, 2024
It seems you are struggling to accept that the people of India…
భారతదేశ ప్రజలు మీ నిరంకుశ, భారమైన పాలన నుండి తప్పుకున్నారని అంగీకరించడానికి మీరు పోరాడుతున్నట్లు కనిపిస్తోందని షర్మిల తెలిపారు. అందుకే ప్రోటోకాల్‌ను స్పష్టంగా ఉల్లంఘిస్తూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీని వెనుక వరుసలోకి నెట్టడం వంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు. మీరు ఇలాంటి వ్యూహాలు ఎంచుకోవడం ద్వారా ఆయన్ను విస్మరించేలా చేయడానికి ప్రయత్నించవచ్చని, కానీ జనం మాత్రం రాహుల్ తోనే నిలబడతారన్నారు. అలాగే పార్లమెంటులో గొంతులేని వారి గొంతుకగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications