YS Sharmila: బడ్జెట్ కాదది.. మ్యానిఫెస్టో- వైఎస్ షర్మిల సెటైర్లు..!

ఇవాళ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ, బీహార్ లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా రాష్ట్రాల్ని విస్మరించారన్న విమర్శలు వినిపించాయి. ఇందుకు తగినట్లుగానే ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన దీన్ని స్వాగతించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బడ్జెట్ పై విమర్శలు గుప్పించింది.

apcc chief ys Sharmila termed union budget as election manifesto- here is why

ఇది బడ్జెట్ కాదని, ఎన్నికల మ్యానిఫెస్టో అని వైఎస్ షర్మిల తేల్చేశారు. ఏది పడితే అది చెప్పొచ్చని, ఏదైనా హామీ ఇవ్వొచ్చని సెటైర్లు వేశారు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాలపరిమితి ఉండాలని కానీ ఇది మ్యానిఫెస్టో అన్నారు. చంద్రబాబు లక్ష కోట్లు కావాలని అడిగారని, ఏపి కి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉందని షర్మిల తెలిపారు. కానీ బాబు అడిగింది కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే అన్నారు. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదన్నారు.

ఇవాళ బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారని, పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారని షర్మిల ఆక్షేపించారు. లైఫ్ లైన్ అన్నారు.. ఫుడ్ సేఫ్టీ అన్నారు, ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదని, 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కి కావాలని షర్మిల గుర్తుచేశారు.
ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారని అడిగారు. హామీలు ఇస్తే సరిపోతుందా ? 500 కోట్లు ఇస్తారా ? 5 వేల కోట్లు ఇస్తారా ? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.
కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారన్నారు. వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారని, ఎప్పుడు ? ఎంత అనేది క్లారిటీ లేదన్నారు. కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా ? అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా బీజేపీ మ్యానిఫెస్టో, అసలు మానేసి కొసరు అన్నట్లు ఉందన్నారు.

ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదని, విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారని షర్మిల విమర్శించారు. విభజనలో మొదటి అంశం హోదా అని గుర్తుచేశారు. అసలు విషయం పక్కన పెట్టి,ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారన్నారు. మోడీ తిరుపతి లో 10 ఏళ్లు హోదా అని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే మాట తప్పినట్లా ? అని అడిగారు. పార్లమెంట్ వేదికగా ఇక హోదా లేదు అని నిరూపితమయ్యిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు కానీ , హోదా మీద చెప్పడం లేదన్నారు.

ఇచ్చిన హామీలు కూడా క్లారిటీ లేవని, బీహార్ కి హోదా లేదు అని చెప్పారని షర్మిల గుర్తుచేశారు. బీహార్ కి హోదా ఇస్తామని ఎవరు మాట ఇవ్వలేదన్నారు. బీహార్ కి హోదా అని పార్లమెంట్ లో హామీ ఇవ్వలేదని తెలిపారు. కానీ ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పిందన్నారు. హోదా నే ఏపి కి సంజీవని అన్నారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+