KiranKumar Reddy : బీజేపీలో కిరణ్ తో పాటు ఎవరూ చేరలేదెందుకు ?
ఏపీలో దాదాపు నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి నిన్న బీజేపీలో చేరారు. కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ప్లహ్లాద్ జోషీ, బీఎల్ సంతోష్, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సాయంతో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీలో కిరణ్ ఎంట్రీకి సంబంధించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ప్రశ్నలు సంధించారు.
"దాదాపు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి , మరో పార్టీలో చేరే సమయంలో కనీసం నలుగురు కూడా అయనతో పాటు ఆ పార్టీ లో చేరకపోవడం, ఆయనకు ఉన్న పలుకుబడికి చక్కటి నిదర్శనం. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు" అంటూ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. కిరణ్ తో పాటు ఇంకెవరూ బీజేపీలో ఎందుకు చేరలేదంటూ ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్ని ఆలోచింపచేస్తోంది.

"గల్లీ నాయకుడు... కౌన్సిలర్ స్థాయి వ్యక్తి ఇతర పార్టీల్లో చేరితేనే, వారితో పాటు అనేకమంది ఆ పార్టీలో చేరుతారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు కనీసం ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు? ఆయన దగ్గర ఉన్నది ఒకటే బంతి! ఇది ఆయనకున్న పలుకుబడి !!" అంటూ సుంకర పద్మశ్రీ తన ఫేస్ బుక్ పోస్టులో సెటైర్లు వేశారు. స్వతహాగా క్రికెటర్ అయిన కిరణ్ రాష్ట్ర విభజన సమయంలో లాస్ట్ బాల్ వేస్తానంటూ చేసిన వ్యాఖ్యల్ని ఇలా ఆయనకు గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications