Chandrababu: చంద్రబాబుకు మరో కేసులోనూ సీఐడీ తాత్కాలిక ఊరట..!

ఏపీ హైకోర్టులో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. గతంలో స్కిల్ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత సీఐడీ ఇతర కేసులు నమోదు చేయడం మొదలుపెట్టింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో హైకోర్టు విచారణల్లో సీఐడీ కీలక హామీ ఇస్తోంది. మధ్యంతర బెయిల్ ముగిసేవరకూ ఇతర కేసుల్లో అరెస్టు చేయబోమని చెబుతోంది.

apcid gives temporary relief to chandrababu in sand case also, informed to high court

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన సీఐడీ... చంద్రబాబును ఇసుక అక్రమాల కేసులోనూ ఆయన మధ్యంతర బెయిల్ ముగిసేవరకూ అరెస్టు చేయబోమని హామీ ఇచ్చింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.

చంద్రబాబుకు స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ కేటాయించిన తర్వాత సీఐడీ ఆయనపై మద్యం, ఇసుక కేసులు పెట్టింది. దీంతో ఆయన ఈ రెండు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టుకు సీఐడీ ఆయన్ను ఈ రెండు కేసుల్లోనూ నవంబర్ 22 వరకూ అరెస్టు చేయబోమని హామీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగే విచారణ ఆధారంగా సీఐడీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబుకు ఈ రెండు కేసుల్లోనూ నవంబర్ 22 వరకూ ఊరట లభించినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+