Amaravati: ఆఫీసు మాది-డిజైన్ మీది-ఆన్ లైన్ లో ఓటింగ్ కోరిన సీఆర్డీఏ..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఈసారి పూర్తిగా ప్రజాభిప్రాయంతోనే చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కీలక అడుగు వేసింది. అమరావతిలో నిర్మించబోయే సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవనం కోసం ఇప్పటికే తీసుకున్న 10 డిజైన్లను ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసిన సీఆర్డీయే వాటిలో ఒక దాన్ని సూచించాలని ప్రజాభిప్రాయం కోరింది. ఇందుకోసం వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్స్ కూడా షేర్ చేసింది.

అమరావతిలో నిర్మించబోయే సీఆర్డీయే భవనం కోసం ఇవాళ పది డిజైన్లను షేర్ చేశారు. భారీ స్దాయిలో ఉన్న ఈ డిజైన్లలో ఒక దాన్ని ఎంచుకునేందుకు ఆన్ లైన్ లోనే ఆప్షన్ ఇచ్చారు. ఇందుకోసం https://crda.ap.gov.in/APCRDAV2/Views/AdminBuildingPoll.aspx లింక్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ ఓపెన్ కాగానే అందులో పది సీఆర్డీఏ భవనాల డిజైన్లు కనిపిస్తాయి. ఇందులో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ మంది ఎంచుకున్న డిజైన్ ను సీఆర్డీఏ భవనం తుది డిజైన్ గా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 6 లోపు ఈ ఓటింగ్ కు అవకాశం ఇచ్చారు.

apcrda invites public opinion on Amaravati central office design-shred 10 pics online

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణం! అంటూ సీఆర్డీఏ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో
ఏపిసిఆర్‌డిఏ ప్రాజెక్టు బిల్డింగు డిజైన్‌ను ఎంపిక చేసే సదవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, సీఆర్‌డిఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న డిజైన్‌లలో మీకు నచ్చిన డిజైన్‌ ఎంపిక చేసేందుకు కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి అంటూ షేర్ చేసింది. దీంతో జనం ఇప్పటికే లింక్ లను క్లిక్ చేయడం మొదలుపెట్టేశారు. ఇలా డిసెంబర్ 6 వరకూ వచ్చిన అభిప్రాయం ఆధారంగా సీఆర్డీఏ తుది నిర్ణయం తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+