సీఎం జగన్‌కు పాలాభిషేకం చేసిన రోజా

ఏపీఐఐసీ చైర్మన్ రోజా సీఎం జగన్‌మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఇటీవల గ్రామసంఘాల సహాయకురాళ్లకు ఇచ్చే గౌరవేతనాన్ని పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా విజయపురం మండల పరిషత్ ఆవరణలో వీవోఏ ఏర్పాటు చేసుకున్న కృతజ్ఝత సభ రోజా ముఖ్య అతిధిగా హజరయ్యారు. అనంతరం వీవోఏలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు

.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ అభివృద్ది కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు.గతంలో వీవోఏల గౌరవవేతనం రెండువేల రూపాయలు నుండి పదివేల రూపాయలకు పెంచుతూ ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

APIIC Chairman Roja Felicitate CM Jaganmohan Reddy

Recommended Video

    AP CM Jagan On APIIC Chairperson Roja ! || కేసీఆర్ విషయం లో రోజా పై సీరియస్ అయిన జగన్..! || Oneindia

    ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న ఆర్ధిక లావాదేవీలతో పాటు ఇతర నెలవారీ కార్యకలాపాలను ఎప్పుటిప్పుడు జరగడంతో పాటు వారికి సహయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి ఇతర రుణాల వ్యవహరాలను చక్కదిద్దటం లాంటీ సమస్యలను వీవోఏలు నిర్వహిస్తారు. కాగా వీరికి పెంచిన గౌరవ వేతనం డిసెంబర్ ఒకటి నుండి అమల్లోకి రానుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో వీఏవోలు సీం జగన్‌కు కృతజ్ఝతగా పాలభిషేకం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+