స్థానిక ఎన్నికల పై షర్మిల అనూహ్య నిర్ణయం, కీలక మలుపు..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశ గా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తు న్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పాత్ర పైన స్పష్టత వస్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా స్థానిక ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.

ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు కొనసాగుతోంది. కూటమి - వైసీపీ ఈ ఎన్నికల కోసం హోరా హోరీగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. కూటమి పార్టీలు వచ్చే వారం సీట్ల సర్దుబాటు పైన సమన్వయ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ నేతలకు ఇప్పటికే స్థానిక ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 మందితో కూడిన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డిని నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా మానిటరింగ్ కమిటీకి షర్మిలా దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల్లో విధివిధానాలు, అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలకు మానిటరింగ్ కమిటీ బాధ్యత వహిస్తుందని ఆమె తెలిపారు.

తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా - వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇక నుంచి..!!
తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా - వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఇక నుంచి..!!
appcc-chief-ys-sharmila-foucs-on-local-body-elections-appoints-monitoring-committee-with-senior-le

స్థానిక ఎన్నికల కోసం కసరత్తు

ఈ దృష్ట్యా జిల్లా, నగర అధ్యక్షులు మానిటరింగ్ కమిటీతో సమన్వయం కావాలని షర్మిలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, మానిటరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తూ షర్మిలా ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్రమంత్రి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలాన్ని నియమించారు. సీడబ్య్లూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రులు పల్లం రాజు, కిల్లి కృపారాణి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, మాజీ రాజ్యసభ ఎంపీ, ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డిలను మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా, ఎన్నికల కో ఆర్డినేషన్ ఇన్‌చార్జిగా అధికార ప్రతినిధి, నెల్లూరు డీసీసీ కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. షెడ్యూల్ విడుదల తరువాత కమిటీ నేతలతో షర్మిల సమావేశం కానున్నారు. దీంతో.. కాంగ్రెస్ ప్రభావం స్థానిక ఎన్నికల్లో ఏ మేర ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+